ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారానికి కృషి చేస్తాం

ABN, First Publish Date - 2021-12-07T05:01:30+05:30

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో భూము లు కోల్పోయిన రైతులకు భూములు, పరిహారం ఇప్పించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సురేందర్‌, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే సురేందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, డిసెంబరు 6: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో భూము లు కోల్పోయిన రైతులకు భూములు, పరిహారం ఇప్పించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సురేందర్‌, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం భూము లు కోల్పోతున్న రైతులతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌, కలెక్టర్‌ జితే ష్‌ వి.పాటిల్‌ సమావేశం నిర్వహించారు. రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. మధ్యవర్తుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. అసైన్‌మెంట్‌ భూములు కోల్పోయిన రైతులందరికీ న్యా యం చేస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో లింగంపల్లి, జన గాం, కరడ్‌పల్లి గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


హరితహారం లక్ష్యాన్ని అధికారులు పూర్తి చేయాలి

హరితహారం లక్ష్యాలను అన్ని శాఖల అఽధికారులు పూర్తి చేయాల ని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో 2022లో శాఖల వారిగా నాటే మొక్కల లక్ష్యాలను నిర్ణయించారు. ఉపాధిహామీ అధికారులు 25లక్షల మొక్కలు నాటాలని సూచి ంచారు. ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, పాఠశాలల వద్ద గల ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. కామారెడ్డి, ఎల్లారెడి, బా న్సువాడలోని మున్సిపల్‌ స్థలాల్లో మొక్కలు నాటే విధంగా చూడాల న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ధోత్రే, డీఎఫ్‌వో నిఖిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T05:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising