ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సదన్‌ విద్యార్థులకు అండగా ఉంటాం

ABN, First Publish Date - 2021-05-17T05:09:24+05:30

మానవత సదన్‌ చిన్నారులందరూ చక్కగా చదువుకుని ఉత్త మ పౌరులుగా ఎదగాలని, సదన్‌ విద్యార్థులకు ఎల్లప్పుడు జిల్లా న్యాయసేవాధికా ర సంస్థ అండగా ఉంటుందని ఆ సంస్థ కార్యదర్శి జే.విక్రం అన్నారు. ఆదివారం డిచ్‌పల్లిలోని మానవత సదన్‌ను సీడీపీవో చైతన్యకులకర్ణితో కలిసి ఆయన మానవతసదన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరూ చక్కగా చదువుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాల ని సదన్‌కు కావాల్సిన సౌకర్యాలపై తనవంతు బాధ్యతగా చర్యలు తీసుకుంటాన ని హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు కల్చరల్‌ ఆక్టివిటీస్‌తో కూడా ముందు ఉండడం అభినందనీయమన్నారు.

మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి విక్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, మే 16: మానవత సదన్‌ చిన్నారులందరూ చక్కగా చదువుకుని ఉత్త మ పౌరులుగా ఎదగాలని, సదన్‌ విద్యార్థులకు ఎల్లప్పుడు జిల్లా న్యాయసేవాధికా ర సంస్థ అండగా ఉంటుందని ఆ సంస్థ కార్యదర్శి జే.విక్రం అన్నారు. ఆదివారం డిచ్‌పల్లిలోని మానవత సదన్‌ను సీడీపీవో చైతన్యకులకర్ణితో కలిసి ఆయన మానవతసదన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరూ చక్కగా చదువుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాల ని సదన్‌కు కావాల్సిన సౌకర్యాలపై తనవంతు బాధ్యతగా చర్యలు తీసుకుంటాన ని హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు కల్చరల్‌ ఆక్టివిటీస్‌తో కూడా ముందు ఉండడం అభినందనీయమన్నారు. పదోతరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో విద్యాభ్యాసంలో రాణించడం అభినందనీయమని, సదన్‌ విద్యార్థులు మార్గదర్శకులుగా నిలవాలన్నారు. కరోనాపట్ల అవగాహ న పొందుతూ భౌతికదూరాన్ని పాటిస్తూ విద్యార్థులు కరోనా దరిచేరకుండా అం దుకు అవసరమయ్యే కిట్లను ఉపయోగిస్తూ ముందుకు రావాలన్నారు. ఇటీవలే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జిల్లాలోని అనాథ విద్యాలయాలను సందర్శించడం జరుగుతుందని, అందులో భాగంగానే మానవతసదన్‌ను సందర్శించినట్లు పేర్కొన్నారు. సదన్‌ విద్యార్థులందరూ తమకు ఎవరులేరని ఆందోళనకు గురికావద్దని ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు. ఈ సందర్భంగా సదన్‌ విద్యార్థులకు విద్య, బోధన అంశాలను సదన్‌ కేర్‌టేకర్‌ రమేష్‌ న్యాయసేవాదికార సంస్థ కార్యదర్శికి వివరించారు. తొందరలోనే మానవతసదన్‌లో విద్యార్థుల బాగోగులు, వారి సమస్యల పరిష్కారం కోసం ప్యారా లీగల్‌ వాలంటీర్‌ను ఏర్పాటు చేస్తామని అం దుకు అవసరమయ్యే శిక్షణ విషయాలు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల కోసం బాలుర సంరక్షణ విభాగం ప్రతినిధి చైతన్య కులకర్ణి, కొవిడ్‌కిట్‌లు, సానిటైజర్‌లను జిల్లా న్యాయసేవాదికార కార్యదర్శి విక్రం ద్వారా విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు.

Updated Date - 2021-05-17T05:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising