ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీయూలో వీసీ దిష్టిబొమ్మ దహనం

ABN, First Publish Date - 2021-10-20T05:24:04+05:30

తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం టీయూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వీసీ దిష్టిబొ మ్మను దహనం చేశారు.

వీసీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీయూ పరిరక్షణ సమితి నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబద్ధపు ప్రచారాల వీసీని తొలగించాలని టీయూ పరిరక్షణ సమితి డిమాండ్‌

డిచ్‌పల్లి, ఆక్టోబరు 19: తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం టీయూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వీసీ దిష్టిబొ మ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీయూ పరిరక్షణ సమితి నాయకుడు పులి జైపాల్‌ మాట్లాడుతూ.. అక్రమ ని యామకాల పేరిట జరిగిన అవినీతిని పక్కదోవ పట్టించడాని కే విద్యార్థి సంఘ నాయకులపై అబద్ధపు ప్రచారం చేస్తున్నార ని అన్నారు. ఇప్పటికైనా అక్రమంగా నియమించిన ఉద్యోగుల ను తొలగించి పాలక మండలి అనుమతితో కొత్తవారిని ఎంపి క చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీ యూ పరిరక్షణ సమితి నాయకులు ఎల్‌బీ రవి, పిల్లి శ్రీకాం త్‌, పుప్పాల రవి, శ్రీనివాస్‌ గౌడ్‌, పంచరెడ్డి చరణ్‌, యెండల ప్రదీప్‌, మహేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీయూ విద్యార్థి సంఘాల మాజీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు 

తెలంగాణ విశ్వవిద్యాలయంలో వీసీ రవీందర్‌ గుప్తాతో పా టు తనపై కూడా అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు అ నుమతి లేకుండా యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలోకి ప్ర వేశించి ఆందోళన చేసిన టీయూ విద్యార్థి సంఘాల మాజీ నా యకులపై మంగళవారం డిచ్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు టీయూ రిజిస్ర్టార్‌ కనకయ్య తెలిపారు. విద్యార్థి సంఘాల మాజీ నాయకులైన శ్రీనివాస్‌ గౌడ్‌, యెండల ప్రదీ ప్‌, పిల్లి శ్రీకాంత్‌, ఎల్‌బీ రవి, పంచరెడ్డి చరణ్‌, పులి జైపాల్‌ పై ఫిర్యాదు చేశానని, తన స్థాయిని కూడా గుర్తించకుండా దుర్భాషలాడారని రిజిస్ట్రార్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. విశ్వవి ద్యాలయానికి సెక్యూరిటీ కల్పించి, విద్యార్థి సంఘాల మాజీ నాయకులపై తగు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌ కోరారు.

పాలకమండలి సభ్యులపై వీసీ వ్యాఖ్యలు సరికాదు

నిజామాబాద్‌ అర్బన్‌: తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులపై వీసీ రవీందర్‌గుప్తా చేసిన వాఖ్యలు సరికాదని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని వర్సిటీ పాలక మ ండలి సభ్యులు వసుంధరదేవి, గంగాధర్‌గౌడ్‌, డాక్టర్‌ మారయ్యగౌడ్‌, ఎం.రాజేందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు, ఇతర పోస్టులను ప్రభుత్వ అనుమతి లేకుండా, పాలక మండలి ఆ మోదంలేకుండా, నోటిఫికేషన్‌ జారీ చేయకుండా, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించకుండా పోస్టులను అమ్ముకున్న విషయం మీడియాలో వస్తోందని వారు తెలిపారు. ఇప్పటికైనా అక్రమ ంగా చేపట్టిన నియామకాలను రద్దుచేసి ప్రభుత్వం నుంచి అ నుమతులు పొంది ఈసీ మీటింగ్‌ నిర్వహించి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు.

Updated Date - 2021-10-20T05:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising