పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలి
ABN, First Publish Date - 2021-12-04T06:19:07+05:30
పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ దళిత మోర్చా ఆధ్వ ర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు.
కామారెడ్డిటౌన్,డిసెంబరు 3: పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ దళిత మోర్చా ఆధ్వ ర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అంతకుముందు బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించకుండా ప్రజలపై పెనుభారం మోపుతుందన్నారు. ప్రతీ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చుతున్న రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఆయా రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను మాత్రం అమలుచేయలేకపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెంచుకుని ధరలు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో బీజేపీ దళితమోర్చా జిల్లా అధ్యక్షుడు తలారీ బాలరాజు, బీజేపీ ప్రచార రాష్ట్రకోకన్వీనర్ దేవేందర్, జిల్లా ప్రధానకార్యదర్శి సుతారి రవి, ఎల్లారెడ్డి మండల దళిత మోర్చా అధ్యక్షుడు ఆశమొల్ల సాయిబాబా, రామస్వామి, రాములు, సత్యం రవి, కృష్ణ, నర్సింలు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-04T06:19:07+05:30 IST