ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదాం నుంచి ధాన్యం బస్తాల చోరీ

ABN, First Publish Date - 2021-07-31T05:55:08+05:30

జిల్లా కేంద్రంలోని ఆరో పట్టణ పోలీసు పరిధిలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రూ.28 లక్షల విలువ చేసే వరిధాన్య ఎత్తుకెళ్లారు. భారీ ఎత్తున వరిధాన్యం చోరీ జరుగడం వల్ల సంఘటనా స్థలానికి దక్షిణ ప్రాంత సీఐ రవి, ఎస్సై ఆంజనేయులుతో కలిసి సందర్శించారు.

దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న సీఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వెయ్యి బస్తాలను ఎత్తుకెళ్లిన దండగులు
- ధాన్యం విలువ సుమారు రూ.28 లక్షలు
- దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు

ఖిల్లా, జూలై 30: జిల్లా కేంద్రంలోని ఆరో పట్టణ పోలీసు పరిధిలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రూ.28 లక్షల విలువ చేసే వరిధాన్య ఎత్తుకెళ్లారు. భారీ ఎత్తున వరిధాన్యం చోరీ జరుగడం వల్ల సంఘటనా స్థలానికి దక్షిణ ప్రాంత సీఐ రవి, ఎస్సై ఆంజనేయులుతో కలిసి  సందర్శించారు. చోరీ జరిగిన తీరును యజమానిని అడిగి తెలుసుకున్నారు.  వివరాలను రూరల్‌ దక్షిణ మండల సీఐ రవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన కైలాస్‌గోయంకర్‌కు సారంగపూర్‌ ప్రాంతంలోని పారిశ్రామిక వాడలో శ్రీరామ రైస్‌మిల్లు పేరుతో గోదాము ఉంది. ఆయన రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని తన గోదాం లో నిలువ ఉంచారు. తరుచూ గోదాముకు వెళ్లి వచ్చే వారు. అయితే, ఇందులో భాగంగానే ఈనెల 9న కూడా గోదాముకు వెళ్లి వచ్చారు. అనంత రం ఈ నెల 30న ఉదయం తిరిగి గోదాముకు వెళ్లి చూడగా.. గోదాము తాళాలు ధ్వంసమై ఉండడాన్ని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఆరో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గోదాముకు వెళ్లి పరిశీలించారు. గోదాములో దొంగతనం జరిగినట్లు తెలుసుకున్నారు. గోదాము నుంచి సుమారు వెయ్యి బస్తాల వరిధాన్యం చోరీకి గురైనట్లు యజమాని పోలీసులకు తెలిపారు. భారీ ఎత్తున చోరీ జరుగడం వల్ల చోరీకి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాల ద్వారా నిందితుల ను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. కేసును సీఐ రవి తన నేతృత్వం లో విచారణ జరుపుతుండగా ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసుకు ని దర్యాఫ్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-31T05:55:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising