ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనువిందు చేస్తున్న రాళ్లవాగు ప్రాజెక్ట్‌

ABN, First Publish Date - 2021-07-19T06:15:55+05:30

ముసురు వర్షాలతో మూగబోయిన రాళ్లవా గు గత గురువారం గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి గుట్ట ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో నిండు కుండలా మారింది. వరద అంతకంతకూ పెరగడంతో మత్తడిదుంకుతోంది. పైనుంచి జాలువారుతున్న జలాలతో రాళ్లవాగు వాటర్‌ ఫాల్‌ను తలపి స్తోంది.

రాళ్లవాగు మత్తడి వద్ద స్నానాలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న సందర్శకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రాజెక్ట్‌ సందర్శనకు భారీగా వస్తున్న పర్యాటకులు
జనసందడితో కళకళలాడుతున్న రాళ్లవాగు పరిసరాలు

కమ్మర్‌పల్లి, జూలై 18: ముసురు వర్షాలతో మూగబోయిన రాళ్లవా గు గత గురువారం గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి గుట్ట ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో నిండు కుండలా మారింది. వరద అంతకంతకూ పెరగడంతో మత్తడిదుంకుతోంది. పైనుంచి జాలువారుతున్న జలాలతో రాళ్లవాగు వాటర్‌ ఫాల్‌ను తలపి స్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా రాళ్లవాగు వద్ద సంద ర్శకుల సందడి కనిపిస్తున్నది. ఈ ప్రాంతంలో వాటర్‌ ఫా ల్‌ లేకపోగా అదే తరహాలో సుమారు 10 మీటర్ల ఎత్తు నుంచి మత్తడి దుంకుతుండడంతో ఆ నీటి కింద  నిలబడి తనివితీరా స్నానాలు చేస్తూ ఎంజయ్‌ చేయడానికి వీలు ఉండడంతో ఆడమగ, చిన్నాపెద్దా తేడా లేకుండా తండోపతం డాలుగా సందర్శకులు వస్తు న్నారు. ప్రతీ ఎడాది సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు కుటుంబ సభ్యుతో కలిసి వచ్చి రాళ్లవా గు అందాలను తిలకించి వెళ్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం సు మారు రెండు నెలలపాటు మత్తడి పారడంతో.. పెద్దసంఖ్య సందర్శకు లు వచ్చారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు గ్రామస్థుల నిరాకరణతో జనసందోహం తగ్గినా.. శనివారం నుంచి మళ్లీ ప్రారంభ మైంది. ఆదివారం భారీ సంఖ్యలో సందర్శకులు రాళ్లవాగువద్దకు చేరు కున్నారు. వాటర్‌ ఫాల్‌వద్ద పకృతి ప్రేమికులు వరుస కట్టి సెల్ఫీలు దిగుతూ ఎంజయ్‌చేశారు. కొందరు అక్కడే వంట చేసుకుని  భోజనా లు చేసి సాయంత్రం వరకు గడిపారు. పిక్‌నిక్‌ స్పాట్‌ను తలపిస్తున్న రాళ్లవాగుకు సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. అ యితే, ప్రకృతి సోయగాలు పంచుతూ ఆహ్లాదకరంగా ఉన్న రాళ్లవాగు వద్దకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం సరైన రహదారి, వర్షం వస్తే తల దాచుకోవడానికి షెడ్లు, పార్కింగ్‌ స్థలం తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సందర్శకులు అంటున్నారు. ఈ దిశగా గ్రామస్థులు, అధికారలు దృష్టి సారించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-07-19T06:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising