ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలు నాటడానికి వీల్లేదు!

ABN, First Publish Date - 2021-06-22T05:38:02+05:30

మండలంలోని తూంపల్లి శివారులో గల భూమిని తాము 30ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామని, ఇ ప్పుడు అధికారులు వచ్చి మొక్కలు నాటుతామంటే తమ పరిస్థి తి ఏమిటని సుమారు వంద మంది రైతులు సోమవారం అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు.

గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎస్సై, రేంజ్‌ అధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూంపల్లిలో అటవీ శాఖ సిబ్బందిని అడ్డుకుంటున్న గ్రామస్థులు
ఎస్సై నచ్చజెప్పినా పట్టించుకోని వైనం

సిరికొండ జూన్‌ 21: మండలంలోని తూంపల్లి శివారులో గల భూమిని తాము 30ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామని, ఇ ప్పుడు అధికారులు వచ్చి మొక్కలు నాటుతామంటే తమ పరిస్థి తి ఏమిటని సుమారు వంద మంది రైతులు సోమవారం అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు. దొంగ చెరువు సమీపంలో గల భూమిలో సుమారు వంద మంది తలా అర ఎకరం చొప్పు న ఆరుతడి పంటలను సాగు చేసుకుంటున్నట్లు వారు అటవీ శాఖ అధికారులకు చెప్పారు. ఇది అటవీ శాఖ భూమి అని, అం దులో మొక్కలు నాటాలని ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు భూమిని చదును చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా అడు ్డకోవడం సరికాదని సూచించారు. సోమవారం ఉదయం సిరికొం డ ఎస్సై ఎం.రాజశేఖర్‌ వెళ్లి రైతులను భూమిలోకి వెళ్లవద్దని వా రించారు. ప్రభుత్వం నుంచి ధ్రువపత్రాలు ఇచ్చి ఉంటే చూపిం చాలని కోరారు. 2005లో దరఖాస్తు చేసుకున్నా అధికారులు త మకు పత్రాలు ఇవ్వలేదని చెప్పారు. అయినా ప్రతి ఏడాది తా ము సాగుచేస్తున్నట్లు ఎస్సైకి చెప్పారు. కానీ, నిబంధనల ప్రకా రం ఆ భూమిలోకి వెళ్లవద్దని ఎస్సై వారిరి సూచించారు.
 రైతులు అడ్డుకుంటున్నది రిజర్వ్వు ఫారెస్టు భూమి..
తూంపల్లి సెక్షన్‌ పరిధిలోని తండా బీట్‌లో గల 512 కంపార్టు మెంటులో ఉన్న 20 హెక్టార్ల భూమి మొత్తం అటవీ శాఖదే అని సిరికొండ రేంజ్‌ అధికారి వాసుదేవ్‌ చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఆ భూమిలో మొక్కలు నాటడానికి భూమిని చ దును చేస్తుంటే గ్రామస్థులు వచ్చి అడ్డుకోవడం ఏమాత్రం సమ ంజసం కాదన్నారు. వారు సాగులో ఉంటే ప్రభుత్వం ఇచ్చిన హ క్కు పత్రాలు చూపించాలని కోరినా వారు చూపించడం లేదన్నా రు. వారు రేపటి వరకు ఏమైనా పత్రాలుంటే తీసుకురావాలని కోరారు. తాము ఆ 20 హెక్ష్టార్ల భూమిలో 28వేల మొక్కలు నా టాలని నిర్ణయించడం జరిగిందని వాసుదేవ్‌ చెప్పారు. తాము క చ్చితంగా అందులో మొక్కలు నాటుతామన్నారు.

Updated Date - 2021-06-22T05:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising