ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు వానాకాలం రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-07-30T04:37:49+05:30

రైతులకు వానాకాలం రుణాల లక్ష్యాన్ని వ్యవసాయ అధికారులు ఇప్పించి పూర్తి చేయాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు.

రుణ ప్రగతి బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ శరత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, జూలై 29: రైతులకు వానాకాలం రుణాల లక్ష్యాన్ని వ్యవసాయ అధికారులు ఇప్పించి పూర్తి చేయాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. గురువారం తన చాంబర్‌లో వ్యవసాయ అధికారులతో పంటల సాగు వివరాలు, ఎరువుల లభ్యత, పంట రుణాల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 10లోగా 50 శాతం పంట రుణాలను రైతులకు ఇప్పించే విధంగా చూడాలని తెలిపారు. పంటల నమోదు వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి నమోదు చేయాలని రైతుల సంతకాలను రిజిష్టర్లలో నమోదు చేయాలని సూచించారు. వారంలో రెండు రోజులు రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు. ఏడాది లోపు పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ వర్తిస్తోందని తెలిపారు. సహకార సంఘాల రైతులకు రసాయని కి ఎరువులు అందించాలని తెలిపారు. బాన్సువాడ డివిజన్‌కు 500, బిచ్కుంద కు 500, కామారెడ్డికి 1,100, ఎల్లారెడ్డికి 2,000 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచే విధంగా వ్యవసాయాధికారులు చూడాలన్నారు. కాగా హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులకు సూ చించారు. మొక్కలకు జియో ట్యాగింగ్‌  వంద శాతం పూర్తి చేయాలని తెలిపారు. మున్సిపాలిటీలు, అటవీ, మైనార్టీ, విద్యుత్‌, ఆర్టీసీ, నీటి పారుదల, ఎక్సైజ్‌, ఫిషరీస్‌, ఆర్టీసీ శాఖలు తమకు నిర్ణయించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
స్త్రీనిధి రుణం కోసం మహిళా లబ్ధిదారులను గుర్తించాలి
కామారెడ్డి టౌన్‌: స్త్రీనిధి ద్వారా పాడి గేదెల రుణ సౌకర్యం కోసం మహిళా లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో స్వయం సహాయక సంఘాలు, మెప్మా, స్త్రీనిధి రుణాల మంజూరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఆగస్టు 8లోగా మహిళా సంఘాలకు 40శాతం రుణాలు మంజూరు చేసి ప్రగతి సాధించాలని డీపీఎం, ఏపీఎం, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. లక్ష్య సాధనలో అలసత్వం ప్రదర్శించిన జుక్కల్‌ మండ లం పెద్దఎడ్గి గ్రామం, హంగర్గ క్లస్టర్‌లకు సంబంధించిన కమ్యూనిటీ కో ఆర్డినేటర్‌ రామును సస్పెండ్‌ చేయాలని, డీపీఎంకు మెమో జారీ చేయాలని ఆదేశించారు.

Updated Date - 2021-07-30T04:37:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising