ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్షణాలు ఉన్న వారికి కిట్టు ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-05-09T05:32:38+05:30

కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో కరోనా నియంత్రణ కోసం లక్షణాలు కనిపించిన ప్రతీఒక్కరికి కరోనా కిట్టు తప్ప నిసరి అందజేయాలని అదనపు కలెక్టర్‌ లత ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాల్కొండ, మే8: కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో కరోనా నియంత్రణ కోసం లక్షణాలు కనిపించిన ప్రతీఒక్కరికి కరోనా కిట్టు తప్ప నిసరి అందజేయాలని అదనపు కలెక్టర్‌ లత ఆదేశించారు. శనివారం బా ల్కొండ మండల కేంద్రంలో చేపడుతున్న ఇంటింటి  సర్వేను ఆమె తనిఖీ చేశారు. ఇంటింటికీ వెళ్తూ ప్రజల ఆరోగ్య స్థితిగతులను నమోదు చేసుకో వాలని, అనుమానం వచ్చిన లక్షణాలు కనిపించే ప్రతీఒక్కరికి కిట్టును అందజేయాన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం పకడ్బంధీ చర్యలు చేపడుతుందని అందుకు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని ఆమె సూచించారు. ఇప్పటి వరకు ఇళ్లలో కరోనా అనుమానితులను గుర్తించారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించి ఆసుపత్రిలో చేపడుతున్న కరో నా టెస్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 45ఏళ్లు దాటిన ప్రతీ ఒక్క రికి టీకా తీసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా కేసులను తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తతో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ డీవో సంతోష్‌కుమార్‌, సర్పంచ్‌ సునీత, వైద్యసిబ్బంది ఉన్నారు. 

ఇంటింటి సర్వేకు సహకరించాలి

మెండోర, మే8: గ్రామాల ప్రజలు ఇంటింటి సర్వేకు సహకరించాలని అదనపు కలెక్టర్‌ లత అన్నారు. శనివారం మండలంలో బుస్సాపూర్‌ గ్రా మంలో పర్యటించి ఇంటింటి సర్వే వివరాలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ లత మాట్లాడుతూ కరోనా కష్టాకాలంలో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు వైరస్‌ బారిన పడిన వారి వివరాలు తెలు సుకునేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టిందని, గ్రామాల ప్రజలు పూర్తి వివరాలు తెలియజేస్తే ముందుగా జాగ్రత్తలు తీసుకోవచ్చని కరోనా మహమ్మరిని తరిమికొట్టాచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ గోపిడి సుజాత, గంగారెడ్డి, ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, సిబ్బంది, తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T05:32:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising