ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2021-05-22T04:34:20+05:30

కరోనా మహమ్మారీని అరికట్టేందుకు చేపడుతున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో రాజాగౌడ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నిజాంసాగర్‌, మే 21 : కరోనా మహమ్మారీని అరికట్టేందుకు చేపడుతున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో రాజాగౌడ్‌ తెలిపారు. శుక్రవారం నిజాంసాగర్‌ మండలం కొమలంచ గ్రామాన్ని సందర్శించారు. కరోనా కట్టడికి నిర్వహిస్తున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి వారికి తక్షణమే మందులను పంపిణీ చేయాలన్నారు. గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పది రోజుల్లోగా నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి కేంద్రాలను మూసి వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో కరోనా లక్షణాలున్న వారికి కరోనా కిట్లను అందజేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ వేణుగోపాల్‌, నాయకులు సత్యనారాయణ, తదితరులున్నారు.  

Updated Date - 2021-05-22T04:34:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising