ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో జిల్లా ప్రథమ స్థానం

ABN, First Publish Date - 2021-10-29T05:21:26+05:30

మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

చెక్కులను అందిస్తున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

కామారెడ్డి, అక్టోబరు 28: మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. గురువారం సత్య కన్వెక్షన్‌ హాల్‌లో రుణ విస్తరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఈ ఏడాది రూ.556 కోట్ల రూపాయల లక్ష్యం ఉండగా రూ.433 కోట్ల లింకేజీ రుణాలు ఇచ్చి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. మహిళలు తీసుకున్న రుణాలు వాయిదా పద్ధతిలో సకాలంలో చెల్లించడం వల్ల వారికి బ్యాంకులు రెట్టింపు రుణా లు ఇస్తున్నాయని పేర్కొన్నారు. రైతుల పంట రుణాలు సకాలంలో చెల్లించాలని కోరారు. రుణ విస్తరణ కార్యక్రమం ఏర్పాటుచేసి ప్రజల ముంగిట్లోకి బ్యాంక్‌ సేవలు అందించిన బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా సమైఖ్యకు, స్వయం సహాయక సంఘాలకు చెక్కులను పంపిణి చేశారు. 16 బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, ఇన్‌చా ర్జ్‌ అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు, కెనరా బ్యాంక్‌ ఏజీఎం శ్రీనివాస్‌రావు, ఎస్‌బీఐ ఏజీఎం పల్లంరాజు, డీజీఎం శేఖర్‌, యూబీఐ డీజీ ఎం నరేంద్రకూమార్‌, టీజీబీ ఆర్‌ఎం నారాయణ, నాబార్డ్‌ డీపీఎం నగేష్‌, డీసీసీబీ సీఈవో గజానంద్‌, లీడ్‌ బ్యాంక్‌ ఎల్‌డీఎం రాజేందర్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
గరుడ యాప్‌ గురించి మండల స్థాయిలో శిక్షణ ఇవ్వాలి
గరుడ యాప్‌ గురించి మండల స్థాయిలో  బూత్‌ లెవల్‌ అధికా రులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. గురువా రం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ నవంబరు 6,7,27, 28వ తేదీల్లో బూత్‌ లెవల్‌ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి జనవరి 1, 2022 నాటికి ప్రమాణికంగా తీసుకుని 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లను నమోదు చేయాలని సూచించారు. మృతి చెందిన వారి పేర్లను, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్ల జాబితా నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising