ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

ABN, First Publish Date - 2021-10-24T04:10:28+05:30

మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో గౌడ కులస్తులకు, గ్రామస్థులకు మధ్య తలెత్తిన వివాదం అధికారుల జోక్యంతో శనివారం ఎట్టకేలకు సద్దుమణిగింది.

మాల్తుమ్మెదలో ఇరువర్గాలతో సమావేశమైన సీఐ, తహసీల్దార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగిరెడ్డిపేట, అక్టోబరు 23: మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో గౌడ కులస్తులకు, గ్రామస్థులకు మధ్య తలెత్తిన వివాదం అధికారుల జోక్యంతో శనివారం ఎట్టకేలకు సద్దుమణిగింది. మాల్తుమ్మెద గ్రామంలో కల్లు ధర పెంపును గ్రామస్థులంతా వ్యతిరేకించిన క్రమంలో గ్రామస్థులకు, గ్రామం లోని గౌడ కులస్తుల మధ్య వివాదం తలెత్తింది. కల్లు సీసా ధరను రూ.5 తగ్గించే వరకు గ్రామంలోని కల్లు దుకాణంలో ఎవ్వరు కూడా కల్లు తాగొ ద్దని గ్రామస్థులంతా సమిష్టిగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో గత 23 రోజులుగా కల్లు విక్రయాలు నిలిచిపోయాయి. దీంతో నిత్యం కల్లు తాగే కల్లుప్రియులు సమీపంలోని ఇతర గ్రామానికి వెళ్లినా తమకు కల్లు విక్రయించకుండా గౌడ కులస్తులు అడ్డుకుంటున్నారనే కారణంతో మాల్తు మ్మెదకు చెందిన గౌడ కులస్తులను సాంఘిక బహిస్కరణ చేయాలని గ్రా మస్థులు నిర్ణయించుకున్నారు. దీంతో గ్రామానికి చెందిన గౌడ కులస్తులు బహిష్కరణ విషయమై పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఎల్లారెడ్డి సీఐ రాజశేఖర్‌, స్థానిక తహసీల్దార్‌ సయ్యిద్‌అహ్మద్‌ మస్రూర్‌లు శనివారం గ్రామానికి చేరుకుని గ్రామస్థులు, గౌడ కులస్తులతో సమావేశమయ్యారు. కల్లు విక్రయించే క్రమంలో తమకు ఇబ్బందులకు గురిచేస్తున్న గౌడ కుల స్తులకు కేవలం భయపెట్టేందుకే సాంఘిక బహిష్కరణ చేసేందుకు ప్రయ త్నించామని, ఇది తమ పొరపాటేనని గ్రామస్థుల తరపున గ్రామ సర్పంచ్‌ భర్త శ్రీనివాస్‌రెడ్డి అధికారుల సమక్షంలో ఒప్పుకున్నారు. దీంతో అధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. ఇక మీదట గ్రామంలో అందరూ కలిసి మెలసి ఉండాలని అధికారులు నచ్చజెప్పడంతో ఇరు వర్గా ల మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. అనంతరం కల్లు ధర తగ్గించే వరకు కల్లు తాగొద్దని గ్రామస్థులు నిర్ణయిం తీసుకున్నారు.

Updated Date - 2021-10-24T04:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising