ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి

ABN, First Publish Date - 2021-01-25T05:33:14+05:30

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్‌ ఆరోపించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూత్‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు.

కామారెడ్డిలో యూత్‌ కాంగ్రెస్‌ సభ్యుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతున్న మధుయాష్కీగౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరున్నర సంవత్సరాలుగా కేసీఆర్‌ రాష్ట్రానికి చేసిందేమీ లేదు

ఇప్పుడు కొడుకొచ్చి ప్రజలకు ఏమి చేస్తాడు?

ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్‌

కామారెడ్డి, జనవరి 24: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్‌ ఆరోపించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూత్‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్శి రాములు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్‌ ప్రతినిధుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆరున్నర ఏళ్లుగా కేసీఆర్‌ చేసిందేమి లేదని తప్పుబట్టారు. రోజురోజుకూ కేంద్రంలో, రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితిని తెస్తున్నారని అన్నారు. రైతుల కు సబ్సిడీలను ఎత్తివేసి రైతు వ్యతిరేక ప్రభుత్వాలుగా మారయని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కొడుకు వచ్చి ఇప్పడు ఏమి చేస్తాడని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థల కోసమే ఉందని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థ లను ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసే విధంగా మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లు ఫౌంహౌజ్‌లో కూర్చోని డబ్బులు లెక్క పెట్టుకుం టున్నారే తప్ప ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్‌ దుష్టపాలనకు యువజన కాంగ్రెస్‌ నాయకులు చరమగీతం పాడాలన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్లాది రూపాయలు కొళ్లగొడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ చైర్మన్‌ మదన్‌మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్‌, గంగారాం, జనార్దన్‌గౌడ్‌, యూసుఫ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T05:33:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising