ఉపాధ్యాయులను నియమించాలి
ABN, First Publish Date - 2021-10-22T03:57:51+05:30
మండలంలోని పెద్దఎడ్గి గ్రామంలోని హైస్కూ ల్‌లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు గురువారం రాస్తా రోకో చేపట్టారు.
జుక్కల్, అక్టోబరు 21: మండలంలోని పెద్దఎడ్గి గ్రామంలోని హైస్కూ ల్‌లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు గురువారం రాస్తా రోకో చేపట్టారు. 205 మంది విద్యార్థులకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నాడని, ఇదీ ఎంత వరకు సమంజసమని విద్యార్థులు ప్రశ్నించారు. జుక్కల్ చౌరస్తాలోని బసవేశ్వర విగ్రహం వద్ద విద్యార్థులు ధర్నా రాస్తా రోకో చేపట్టారు. అనంతరం ఎంఈవో, ఎంపీడీవోలకు వినతిపత్రాన్ని అం దజేశారు. ఈ కార్యక్రమంలో ఉమాకాంత్ పటేల్, అస్పత్‌వారు రవి, సంతోష్ దేశాయి, వినోద్ తదితరులున్నారు.
Updated Date - 2021-10-22T03:57:51+05:30 IST