ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాత్కాలికంగా రెండు హోటళ్ల లైసెన్స్‌ రద్దు

ABN, First Publish Date - 2021-10-30T05:15:16+05:30

నగరంలోని అరేబియన్‌ మండి, గ్లామర్‌ హోటళ్ల లైసెన్స్‌లను 15 రోజుల పాటు రద్దుచేసినట్లు ఆహార కల్తీ నియంత్రణ అధికారి తార్యానాయక్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సుభాష్‌నగర్‌, అక్టోబరు 29: నగరంలోని అరేబియన్‌ మండి, గ్లామర్‌ హోటళ్ల లైసెన్స్‌లను 15 రోజుల పాటు రద్దుచేసినట్లు ఆహార కల్తీ నియంత్రణ అధికారి తార్యానాయక్‌ తెలిపారు. రెండు హోటళ్లలో 15 రోజుల పాటు శుభ్రతను, క్వాలిటీ ప్రొడక్ట్స్‌ వాడాలని 15 రోజుల తర్వాత పరిశీలించి లైసెన్స్‌ను రెన్యువల్‌ చేస్తామని తెలిపారు. అరేబియన్‌ మండిలో కొన్ని రోజుల క్రితం ఫ్యామిలీతో తినడానికి వెళ్లిన కొందరు ఆసుపత్రి పాలవడంతో వారు ఆహార కల్తీ నియంత్రణ అధికారికి ఫిర్యాదు చేశారు. కల్తీ నియంత్రణ అధికారి అరేబియన్‌ మండిపై తనిఖీలు చేసి శాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు. రెండు రోజుల క్రితం గ్లామర్‌  హోటల్‌లో బిర్యానీలో బీడీ ముక్క రావడంతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెండు హోటళ్ల లైసెన్సులను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా హోటల్‌ నిర్వాహకుల్లో మార్పులు రావాలని, లేకుంటే లైసెన్సులను పూర్తిగా రద్దుచేస్తామని హెచ్చరించారు

Updated Date - 2021-10-30T05:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising