ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలీలను తరలించొద్దని చెరుకు రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2021-01-18T05:05:42+05:30

చెరుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. చెరుకు ఫ్యాక్టరీకి తరలించే సమయం అవుతున్నప్పటీకీ చెరుకు నరికేందుకు కూలీల ముఠా అందు బాటులో లేకపోవడంతో చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సీతారాంపూర్‌లో చెరుకు ట్రాక్టర్‌ వద్ద నిరసన తెలుపుతున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమకొండ, జనవరి 17: చెరుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. చెరుకు ఫ్యాక్టరీకి తరలించే సమయం అవుతున్నప్పటీకీ చెరుకు నరికేందుకు కూలీల ముఠా అందు బాటులో లేకపోవడంతో చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమకొండ మండలం సీతారాంపూర్‌, బీబీపేట మండలం మాందాపూర్‌ గ్రామాలకు కలిపి ఒకటే ముఠా రావడంతో ప్రస్తుతం సీతారాంపూర్‌లో చెరుకు నరకు తున్నారు. మరికొన్ని రోజులు సీతారాంపూర్‌లో చెరుకు నరికితే పూర్తి అవుతుందని, కానీ ఫీల్ట్‌ ఆఫీసర్‌ సుధాకర్‌ ముఠాను సీతారాంపూర్‌ నుంచి మందాపూర్‌కు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరుకు ట్రాక్టర్‌ లోడ్‌ వద్ద అరగంట పాటు నిరసన తెలిపి ఫ్యాక్టరీ నుంచి అధికారులు రావాల్సిందే నని మొండికేశారు. ఈ విషయమై ఫీల్ట్‌ ఆఫీసర్‌ను వివరణ కోరగా రెండు గ్రామాలకు ఇకే ముఠా వచ్చిందని, మందా పూర్‌లో మిషన్‌ ద్వారా చెరుకు నరకడం జరిగిందని మిగిలిన కొన్ని ఎకరాలు మొదటి లైన్‌లో ఉండటం వల్ల వారి చెరుకు నరికేందుకు ముఠాను అక్కడికి పంపడం జరుగుతుందని తెలిపారు. మాందాపూర్‌లో మూడు రోజుల్లో పూర్తి అవుతుందని అనంతరం సీతారాంపూర్‌లో చెరుకు నరుకు తారని తెలిపారు. కార్యక్రమంలో రైతులు రవి, రమేష్‌, శ్రీనివా స్‌, విజయ్‌, రాజయ్య, పెంటయ్య, శంకర్‌, నారాయణ, సత్యం, పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T05:05:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising