ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమతులు లేకుండా నిర్మాణాలు

ABN, First Publish Date - 2021-04-09T06:29:00+05:30

నగరంలో అనుమతులు లేకుండానే యథేచ్ఛగా భవన నిర్మాణాలు జరుగుతున్నా యి. ఇంటి నిర్మాణాలతో పాటు వ్యాపార సముదాయాల భ వనాల నిర్మాణాలు సైతం ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే జరుగుతున్నాయి. అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు, ఇతర భవనాలు నిర్మించవద్దనే నిబంధనలు ఉన్న వాటన్నింటిని తుంగలో తొక్కి ఇష్టారీతిన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. తనిఖీలు చేసి చర్యలు చేపట్టాల్సి ఉన్నా నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

నగరంలోని గాంధీ చౌక్‌ ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టించుకోని నగరపాలక సంస్థ అధికారులు

రాకపోకలకు తీవ్ర అంతరాయం

నిజామాబాద్‌అర్బన్‌, ఏప్రిల్‌ 8: నగరంలో అనుమతులు లేకుండానే యథేచ్ఛగా భవన నిర్మాణాలు జరుగుతున్నా యి. ఇంటి నిర్మాణాలతో పాటు వ్యాపార సముదాయాల భ వనాల నిర్మాణాలు సైతం ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే జరుగుతున్నాయి. అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు, ఇతర భవనాలు నిర్మించవద్దనే నిబంధనలు ఉన్న వాటన్నింటిని తుంగలో తొక్కి ఇష్టారీతిన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. తనిఖీలు చేసి చర్యలు చేపట్టాల్సి ఉన్నా నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 

గాంధీచౌక్‌ ప్రాంతంలో.. 

నగరంలోని నడిబోడ్డున నిత్యం వేలాది మందితో కిటకిటలాడే గాంధీచౌక్‌ ప్రాంతంలో కమర్షియల్‌ భవనాలకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. 30 ఫీట్లు కూడా లేని రోడ్డులో ఎ లాంటి సెట్‌బ్యాక్‌లు లేకుండానే నిర్మాణం పూర్తి చేశారు. థి యేటర్‌ పార్కింగ్‌ స్థలంలో ఏకంగా బహుళ అంతస్తుల భ వనాన్ని నిర్మించి వాటిలో ఉన్న రూంలకు అద్దెకు ఇచ్చి సొమ్ముచేసుకుంటున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. సినిమా థియేటర్‌ చుట్టూ ఆనుకుని ప్రమాదాలు జరిగితే ఫైర్‌ ఇంజన్‌ తిరిగేలా ఉం డాలనే నిబంధనలు ఉన్నా అవేమి పట్టించుకోకుండా రోడ్డు ను సైతం ఆక్రమించి వ్యాపార సముదాయాన్ని నిర్మించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  స్థలం లేకపోగా ఇప్పుడు నిర్మించిన వ్యాపార సముదాయంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలి గే అవకాశం ఉంది. నగరం నడిబోడ్డున అనుమతులు లే కుండా నిబంధనలు పాటించకుండా నిర్మించిన బహుళ అంతస్తుల భవనంపై నగరపాలక సంస్థ అధికారులు ప ట్టించుకోకపోవడం అనేక విమర్శలకు తావిస్తుంది. 

ఎలాంటి అనుమతులు లేవు : వికాస్‌, (డీసీపీ)

గాంధీచౌక్‌ ప్రాంతంలో నిర్మిస్తున్న వ్యాపార సముదాయానికి ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు లేకుం డా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-04-09T06:29:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising