ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-02-25T04:55:01+05:30

వేసవి సమీపిస్తున్న దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా చూడాలపి కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌అర్బన్‌, ఫిబ్రవరి 24 : వేసవి సమీపిస్తున్న దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా చూడాలపి కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బు ధవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో ము న్సిపల్‌ కమిషనర్‌లు, మిషన్‌ భగీరథ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి ముందస్తు ప్రణాళిక చేసుకోవాలన్నారు. మిషన్‌ భగీరథ స్కీం విజయవంతంగా అన్ని స్టేషన్‌లలో తా గునీటికి ఇస్తున్నారని ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అభినందించారు. గతే డాది సింగూరులో నీరు లేకున్నా తాగునీరు ఇచ్చామని, ఈ సారి అన్ని రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయన్నారు. ప్రతీ ఒక్కరికి 100లీటర్ల నీటిని అందించాలనే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని అన్నారు. ఇందుకు ప్లా న్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఉండాలని గ్రౌండ్‌ లెవల్‌లో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారు. వేసవి కాలంలో ఊరిలో వాటర్‌ రాలేదు అన్న చిన్నమాట రావద్దని, వాటర్‌ లేక ఇబ్బంది పడుతున్నామన్న మాట రాకూడదని అన్నారు. సమావేశంలో అడిషన్‌ కలెక్టర్‌ లత, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి.పాటిల్‌, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ రాజేంద్రకుమార్‌, ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపల్‌ కమిషనర్‌లు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T04:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising