ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి

ABN, First Publish Date - 2021-10-22T04:17:19+05:30

రైతుల శ్రేయస్సుకై రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, అక్టోబరు 21: రైతుల శ్రేయస్సుకై రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 343 ఽధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1960,సాదారణ రకంకు రూ.1940 చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరిచి, ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. 5లక్షల 80 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపోందించారని తెలిపారు. రైతులు ధాన్యం విక్రయించిన సమయంలోనే పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంక్‌ అకౌంట్‌ పాసు పుస్తకం, ఆదార్‌కార్డు నకల్‌ అందజేస్తే డబ్బులు తక్షణమే అందేవీలుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన లారీలను రైస్‌ మిల్లర్లు 12 గంటలలోపు అన్‌లోడ్‌ చేసే విధంగా చూడాలని తెలిపారు.జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కంట్రోల్‌ రూం ఫోన్‌ నంబర్‌ 08468-220051కు సమస్యలున్నవారు తెలియజేయాలని వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉంటే మండల స్థాయి కమిటిలకు తెలియజేసీ పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేవంలో ప్రభుత్వ విప్‌ గంపగోవర్దన్‌, జడ్పీ చైర్మన్‌ శోభ, ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, ఇంచార్జ్‌అదనపు కలెక్టర్‌ వెంకటమాదవరావు, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, సివిల్‌ సప్లయ్‌ డీఎం జితేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T04:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising