కామారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా శ్రీనివాస్‌రెడ్డి
ABN, First Publish Date - 2021-12-25T05:50:15+05:30
జిల్లా నూత న ఎస్పీగా బి. శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వం నియామకపు ఉత్త ర్వులు జారీ చేసింది.
సిద్ధిపేట సీపీగా శ్వేతారెడ్డి బదిలీ
కామారెడ్డి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా నూత న ఎస్పీగా బి. శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వం నియామకపు ఉత్త ర్వులు జారీ చేసింది. ఇది వరకు ఎస్పీగా పని చేసిన శ్వేతారెడ్డి సిద్దిపేట పోలీసు కమిషనర్‌గా బదిలీ అయ్యా రు. 2012వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శ్వేతారెడ్డి కామారె డ్డి జిల్లాలో సుదీర్ఘకాలం ఎస్పీగా పని చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో ఎనలేని కృషి చేశారు. మరీ ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఆమె ప్రత్యేక దృష్టి సారించి సఫలీకృత మయ్యారు. కాగా మరో రెండు మూడు రోజుల్లో కొత్త ఎస్పీగా బి. శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Updated Date - 2021-12-25T05:50:15+05:30 IST