ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంకటాలను హరించే సంకష్ట హర చతుర్థి నేడు

ABN, First Publish Date - 2021-10-24T05:51:38+05:30

సంకటాలను హరించే సంకష్ట హర చతుర్థి పూజలు ఆదివారం గణపతి ఆల యాల్లో జరగనున్నాయి. ఆశ్వీజమాసంలో వచ్చే సంకష్ట చవితికి ప్రత్యేకంగా భావిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వినాయకుడికి విశేష పూజలు 

నిజామాబాద్‌ కల్చరల్‌, అక్టోబరు 23: సంకటాలను హరించే సంకష్ట హర చతుర్థి పూజలు ఆదివారం గణపతి ఆల యాల్లో జరగనున్నాయి. ఆశ్వీజమాసంలో వచ్చే సంకష్ట చవితికి ప్రత్యేకంగా భావిస్తారు. వినాయకుడికి ప్రీతికరమైన ఈ రోజున ఆలయాల్లో గణపతి ఆధర్వణ శీర్షంతో అభిషేకాలు నిర్వహిస్తారు. స్వామికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పిస్తారు. భక్తులు ఉపవాస దీక్షలను పాటిస్తూ పూజాది కార్యక్రమాలను జరుపుతారు. భక్తుల కష్టాలను సంకష్ట హర చతుర్థి వ్రతంతో తొలగిస్తారని విఘ్నేశ్వరుడు చెప్పినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. దీంతో  ప్రతీ మాసం పౌర్ణమి  తర్వాత వచ్చే చతుర్థి నాడు కష్టాలను తొలగించ కోరిన కోరికలు తీర్చమని భక్తులు ఆరాధిస్తారు. చతుర్థి నాడు ఉపవాస దీక్షలు చేపట్టే భక్తులు సాయంత్రం ఆలయాల్లో జరిగే సామూహిక సంకష్ట పూజల్లో పాల్గొని చంద్రుడి దర్శనంతో ఉపవాస దీక్షను విరమిస్తారు. సంకష్ట చతుర్థి నాడు చంద్రోదయం 8.25 నిమిషాలకు ఉండడంతో భక్తులు వినాయక ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని సార్వజనిక్‌ గణేష్‌ ఆలయం, పద్మానగర్‌లోని సిద్దివినాయక ఆలయం, న్యూహౌజింగ్‌ బోర్డులోని మహా గణపతి ఆలయం, బోర్గాంలోని లక్ష్మి గణపతి ఆలయం, బొడ్డెమ్మ చెరువు వల్ల గల మహా గణపతి ఆలయం, బ్రహ్మపురిలోని వరసిద్ది వినాయక ఆలయం, ఉమ్మడి జిల్లా పరిధిలోని గణపతి దేవాలయాల్లో సంకష్టహర చతుర్థి పూజలు నిర్వహించనున్నారు.

Updated Date - 2021-10-24T05:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising