ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.9.66 కోట్ల మంజూరు

ABN, First Publish Date - 2021-04-16T06:15:48+05:30

కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం పరిధిలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నిధులను మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్‌ గంపగోవ ర్ధన్‌ గురువారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం పరిధిలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నిధులను మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్‌ గంపగోవ ర్ధన్‌ గురువారం తెలిపారు. నియోజకవర్గంలోని మాచా రెడ్డి మండలంలో బ్రిడ్జి, బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రభు త్వం రూ.9.66కోట్లు నిధులు మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మాచారెడ్డి మండలంలోని బండ రామేశ్వర్‌ పల్లి, లచ్చంపేట గ్రామాల మధ్య ప్రజల ప్ర యాణానికి ఇబ్బంది ఉండడంతో బ్రిడ్జి నిర్మాణానికి,  పీఎంజీఎస్‌వై పథకం కింద బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.5 లక్షలు మంజూరయ్యాన్నారు. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్‌ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బ్రహ్మణ్‌పల్లి తండా వయా బండరామేశ్వర్‌పల్లి, లచ్చపేట, ఆకుల గుట్టతండా వరకు పీఎంజీఎస్‌వై పథకం క్రింద బీటీ రోడ్డు వేసేందుకు రూ.5.61 లక్షలు మంజూరు చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్‌ నిధులు మంజూరు చేసినందుకు ప్రభుత్వ విప్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-04-16T06:15:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising