ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి

ABN, First Publish Date - 2021-10-29T05:39:40+05:30

కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చే ధాన్యం నాణ్యత ప్రమా ణాలతో ఉండాలని సిరికొండ మండల ప్రత్యేక అధికారి, జి ల్లా సహకార అధికారి సింహా చలం రైతులను సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సిరికొండ, అక్టోబరు 28 : కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చే ధాన్యం నాణ్యత ప్రమా ణాలతో ఉండాలని సిరికొండ మండల ప్రత్యేక అధికారి, జి ల్లా సహకార అధికారి సింహా చలం రైతులను సూచించారు. సిరికొండ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడా రు. ధాన్యంలో ఎలాంటి పొల్లు, మట్టి, తాలు లేకుండా తీసుకురావాలన్నారు. దీంతో తూకంలో కడతా ఉండదన్నారు. బస్తాకు 41 కిలోల ధాన్యాన్ని తూకం వేసిన రైస్‌మిల్లర్లు తరుగు పేరుతో కోత విధిస్తే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు. లారీల సమస్య ఈసారి ఉండదన్నారు. ప్రతీ మండలానికి లారీలను కేటాయించడంతో పాటు వాటికి సిరికొండ మండలమని స్టిక్కర్లను అతికిస్తామని తెలిపారు. మధ్యలో ఎవరైనా రైతులు డ్రైవర్లకు డబ్బులిచ్చి దారి మళ్లించకుండా పగడ్బందీ ఏర్పాట్లను చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో రైతులు లేవనెత్తిన సందేహాలను డీసీవో నివృత్తి చేశారు. సిరికొండ పీఏసీఎస్‌ అధ్యక్షుడు మైలారం గంగారెడ్డి, సిరికొండ సర్పంచ్‌ ఎన్నం రాజరెడ్డి, మైలారం ఎంపీటీసీ సతీష్‌, ఎంపీడీవో లక్ష్మీప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు మాలవత్‌ రాజేందర్‌ పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising