ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తీర్చాలి

ABN, First Publish Date - 2021-05-21T04:36:59+05:30

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలని భారతీయ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అన్నారు.

కలెక్టర్‌కు వినతి పత్రం అందిస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి టౌన్‌, మే 20: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలని భారతీయ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు పరిశీలించి తూకంలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శరత్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి వడ్ల కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా ల్లో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15 శాతం తేమ ఉండి ఒక్కో సంచిలో 41కిలో 600 గ్రాముల బరువు తూకం వేస్తున్నప్పటికీ మళ్లీ రైస్‌మిల్లర్లు ఒక్కో లారీకి 2 నుంచి 6 క్వింటాళ్ల వరకు తరుగు తీసివేస్తున్నారని అన్నారు. లింగాపూర్‌ సెంటర్‌లో తరుగు పేరిట ఇప్ప టికే దాదాపు 200 క్వింటాళ్ల ధాన్యం తీసివేశారన్నారు. ట్రక్‌షిట్‌, బరువు చీటీల ద్వారా విచారణ చేపట్టి సంబంధిత అధికారులు, రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. వానాకాలం సమీపిస్తుండడంతో కొనుగోళ్లు త్వరగా చేపట్టాలని, లారీ యజమానులు అదనంగా డబ్బు లు వసూలు చేస్తున్నారని వాటిపై దృష్టి సారించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల భరత్‌, నరేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-21T04:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising