హసాకొత్తూర్‌లో కవయిత్రి మొల్లమాంబ జయంతి
ABN, First Publish Date - 2021-03-14T05:44:48+05:30
శాలివాహన తొలి కవయిత్రి, రామాయణాన్ని తొలిసారిగా తెలుగులో రచించిన కవయిత్రి మొల్లమాంబ 581వ జయంతి వేడుకలను శనివారం మండలంలోని హసాకొత్తూర్‌లో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కమ్మర్‌పల్లి, మార్చి 13: శాలివాహన తొలి కవయిత్రి, రామాయణాన్ని తొలిసారిగా తెలుగులో రచించిన కవయిత్రి మొల్లమాంబ 581వ జయంతి వేడుకలను శనివారం మండలంలోని హసాకొత్తూర్‌లో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా సంఘం సభ్యులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం సభ్యులు మాట్లాడుతూ.. 15వ శతాబ్దానికి చెందిన మొల్లమాంబ.. స్త్రీలు సాహిత్య ంలో ఏమాత్రం తక్కువ కాదని నిరూపించిందన్నారు. ప్రకృతిని ఆరాదించే ప్రతిఒక్కరూ సాహితీ ప్రియులేనని, అక్షర రూపంచేసి నిరూపించిన మహోన్నత వ్యక్తి శాలివాహనుల ఆడపడుచు మొల్లమాంబ అన్నారు. 24 వేల శ్లోకాలు, 7 ఖండాలతో ఉన్న రామాయణాన్ని 871 శ్లోకాలు 8 ఖండాలతో సా మాన్యులకు సైతం అర్థమయ్యేలా సంక్షిప్తంగా సరళ భాష లో రామాయణాన్ని రచించిన తొలి తెలుగు కవయిత్రిగా మొల్లమాంబకు గుర్తింపు ఉంద న్నారు. అనంతరం శాలివా హన వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ నరేష్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికు లు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, రైతు నాయకుడు నోముల నరేందర్, గ్రామ సంఘ అధ్యక్షుడు రాజేందర్, దశరత్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-14T05:44:48+05:30 IST