ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్లకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటాలి

ABN, First Publish Date - 2021-06-18T05:31:46+05:30

రోడ్లకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటి భవిష్యత్తు తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు.

గర్గుల్‌లో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, జూన్‌ 17: రోడ్లకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటి భవిష్యత్తు తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. గురువారం మండలంలోని గర్గుల్‌ అవెన్యూ ప్లాంటేషన్‌, పల్లె ప్రకృతి వనం, పాఠశాల ప్రకృతి వనం, ఆక్సిజన్‌ పార్క్‌, కంపోస్టుషెడ్డు, శ్మశానవాటిక, నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా పెద్ద మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. నాటిన మొక్కలకు కంచె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి వారికి కావాల్సిన మొక్కలను రిజిస్టర్‌లో నమోదు చేసి అందించాలని తెలిపారు. మంకీఫుడ్‌ కోర్టులో నేరేడు, చింత, జువ్వి, రావి, జామా, మామిడి మొక్కలను నాటాలని తెలిపా రు. డివిజన్‌ స్థాయి అధికారులు పారిశుధ్యం, తాగునీరు, అవెన్యూ ప్లాంటేషన్‌, నర్సరీ, కంపోస్టుషెడ్‌, వైకుంఠధామం పక్కగా చేపట్టే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, ఎంపీపీ ఆంజనేయులు, డీఎల్‌పీవో సాయిబాబా, ఎంపీడీవో నాగేశ్వరరావు, సర్పంచ్‌ రవితేజాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ: మండలంలోని లింగుపల్లిలో అవెన్యూ ప్లాం టేషన్‌, దోమకొండలో పల్లెప్రకృతి వనంను గురువారం కలెక్టర్‌ శరత్‌ పరిశీలించారు. గ్రామాల్లో పరిశుధ్య పనులను చేపట్టాలని కార్యదర్శులను ఆదేశి ంచారు. వర్షాకాలంలో గ్రామాలు శుభ్ర ంగా ఉంచాలన్నారు.  కార్యక్రమం లో స్థానిక సంస్థల జిల్లా అద నపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఏపీడీ సాయన్న, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఎంపీవో తిరుపతి రెడ్డి, సర్పంచ్‌ అంజలి

Updated Date - 2021-06-18T05:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising