ఒకరిపై పీడీ యాక్ట్ నమోదు
ABN, First Publish Date - 2021-10-22T03:56:52+05:30
సదాశివనగర్ మండ లంలోని అమర్లబండకు చెందిన కుంట రతన్‌కుమార్(35)పై పీడీ యాక్ట్ నమోదు చేసి చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎస్‌పీ శ్వేతారెడ్డి తెలిపారు.
కామారెడ్డి, అక్టోబరు 21: సదాశివనగర్ మండ లంలోని అమర్లబండకు చెందిన కుంట రతన్‌కుమార్(35)పై పీడీ యాక్ట్ నమోదు చేసి చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎస్‌పీ శ్వేతారెడ్డి తెలిపారు. రతన్ కుమార్‌పై ఇప్పటికే సదాశివనగర్ పోలీసుస్టేషన్‌లో 9 కేసులు, దేవునిపల్లి, గాంధారి పోలీసు స్టేషన్‌లో ఒక్కో కేసు, కరీంనగర్ టూ టౌన్‌లో ఒక కేసు ఇలా మొత్తం 12 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సదాశివనగర్ పోలీసు స్టేషన్‌లో రౌడిషిట్ కూడా ఉందని, నేరపూరిత చర్యల ద్వారా ప్రజలను భయాందోళనకు గురిచేస్తు, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకపరుస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలుగజేస్తున్నాడని తెలిపారు. నిందితుడు ఒక సంవత్సర కాలంపాటు జైలులో ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఎవరైన ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకపరిస్తే, తరుచూ నేరాలకు పాల్పడుతూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే జైలు జీవితానికి దారితీస్తుందని తెలిపారు.
Updated Date - 2021-10-22T03:56:52+05:30 IST