ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కిట్లు లేనిది.. పరీక్షలెందుకు?

ABN, First Publish Date - 2021-04-17T06:34:31+05:30

తెలంగాణ ప్రభుత్వం కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో 45ఏళ్లు నిండిన వారందరూ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రచారం చేస్తున్న వాస్తవ పరిస్థితి అందు కు విరుద్ధంగా ఉంది నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి 30 పడకల ఆస్పత్రి పరిస్థితి. శుక్రవారం ఉదయం ఆస్పత్రిలోని వై

కరోనా పరీక్షలు నిర్వహించడం లేదని మండిపడుతున్న యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లిలో 30 పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బందిపై నిప్పులు చెరిగిన బాధితులు

ఆస్పత్రి ఎదుట ఆందోళన 

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 16: తెలంగాణ ప్రభుత్వం కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో 45ఏళ్లు నిండిన వారందరూ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రచారం చేస్తున్న  వాస్తవ పరిస్థితి అందు కు విరుద్ధంగా ఉంది నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి 30 పడకల ఆస్పత్రి పరిస్థితి. శుక్రవారం ఉదయం ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది ఉదయం 8 నుంచి 10గంటల వరకు 80 మంది కరోనా బాధితుల కరోనా పరీక్షల కోసం వచ్చిన వారి పేర్లు, నమోదు చేసుకున్న అనంతరం.. పరీక్షల సమయంలో తమ వద్ద కిట్లు లేవని, రెండు రోజుల తర్వాత రావలని వైద్య సిబ్బంది కరోనా పరీక్షల కు వచ్చిన వారికి సమాధానం చెప్పడంతో డిచ్‌పల్లి, ధర్మారం, మెంట్రాజ్‌పల్లి, ముల్లంగి, ఘన్‌పూర్‌, ఇస్లాంపూర, దూస్‌గాం, ఖిల్లా డిచ్‌పల్లి గ్రామాల నుంచి వచ్చిన పలువురు బాధితులు నిప్పులు చెరిగారు. ఇక వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితం గా కరోనా పరీక్షలు చేసుకొని కరోనా టీకాలు తీసుకోవాలని గొప్పలు చెబుతున్న డిచ్‌పల్లి సీహెచ్‌సీ వైద్యుల నిర్లాక్ష్యం మరో రకంగా ఉంది. ప్రభుత్వ వైద్యం పక్కన పెట్టి, ప్రైవేట్‌ వైద్యంపై దృష్టి సాధించిన వైద్య శాఖ అధికారులు కరోనా కిట్లు లేనిది తమ పేర్లు నమోదు చేసుకొని బూకయించడం దేనికని మండిపడ్డారు. ఆస్పత్రి వద్ద కరోనా పరీక్షల కు వచ్చిన వారంత వైద్య సిబ్బందిపై నిలదీసి ప్రశ్నించరరు. కరోనా పరీక్షలు చేసుకోవాలని చెబుతున్న అధికారులు కిట్లు లేకుండా పరీక్షలు ఏలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పే వాస్తవికతలో వైద్య అధికారుల నిర్లాక్ష్యం కారణంగా కరోనా పరీక్షలు డిచ్‌పల్లి ఆస్పత్రిలో సక్రమంగా జరగడం లేదని పలువురు విలేకర్లతో వాపోయారు. డిచ్‌పల్లి సీహెచ్‌సీలో కరోనా వైద్య పరీక్షలు చేసేవారు పాజిటివ్‌ వచ్చిన వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం లేదు. దీంతో బహిరంగం గానే పాజిటివ్‌ వచ్చిన వారు తిరుగుతుండటం వల్ల కరోనా వ్యాప్తి అధికమవుతుంది. ఇప్పటికై జిల్లా వైద్యాశాఖా అధికారులు ప్రత్యేక దృష్టి సాధించి కరోనా కిట్లు అందుబాటులో ఉంచి పరీక్షలు జరిగే విధంగా చూడటం వల్ల గ్రామీణ ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. 

Updated Date - 2021-04-17T06:34:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising