ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ

ABN, First Publish Date - 2021-08-24T02:41:30+05:30

నిజామాబాద్: నందిపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: నందిపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో రామకృష్ణ సేవాసమితి ఫౌండర్ సముద్రాల నరసింహా చారి ప్రసంగిస్తూ స్వామి వివేకానంద ప్రభోదించిన అనుష్టాన వేదాంతం గురించి చెప్పారు. మన భవిష్యత్తుకు మనమే కర్తలమని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కుల మత జాతి ప్రసక్తి లేకుండా అందరిలో దైవాన్ని చూడాలని, దీనుల్లో భగవంతుడిని చూడటమే నిజమైన ఆరాధన అని వివేకానంద చెప్పేవారని నరసింహాచారి తెలిపారు. యువత మంచి అలవాట్లతో ఉన్నత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని స్వామి వివేకానంద అభిలషించేవారని ఆయన గుర్తు చేశారు. పల్లుగుట్టకు చెందిన కేదారాశ్వర ఆశ్రమాధిపతి మంగి రాములు మహరాజ్ ప్రసంగిస్తూ స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. అనాదిగా వస్తున్న భారత సంస్కృతీ సంప్రదాయాలను పాటించాలని సూచించారు. బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం నామోషీగా భావించరాదని చెప్పారు. మద్యపానానికి స్వస్తి చెప్పినప్పుడే మంచి అలవాట్లు సాధ్యమౌతాయని మహరాజ్ చెప్పారు. కార్యక్రమంలో కేర్ డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ నరాల సుధాకర్, సామాజిక సేవా కార్యకర్త దస్తగిరి, నాలేశ్వర్ గ్రామ సర్పంచ్ ద్యాగ సరీం, నాలేశ్వర్ వివేకానంద యువ విభాగ్ సభ్యులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-08-24T02:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising