ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల సంక్షేమం కోసమే కొత్త రేషన్‌కార్డులు

ABN, First Publish Date - 2021-07-27T06:30:55+05:30

రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్‌ నూతన రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం బాల్కొండ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌ తో కలిసి కొత్తగా మంజూరైన రేషన్‌ కార్డులను ఆయన లబ్ధిదారులకు అందజే శారు.

బాల్కొండలో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు అందజేస్తున్న మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారంలో ఎవరు ఉండాలనేది నిర్ణయించేది ప్రజలే
జైశ్రీరాం నినాదం ఓట్ల కోసం కాదు.. గుండెల్లోంచి రావాలి
రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి

బాల్కొండ, జూలై 26: రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్‌ నూతన రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం బాల్కొండ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌ తో కలిసి కొత్తగా మంజూరైన రేషన్‌ కార్డులను ఆయన లబ్ధిదారులకు అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 87లక్షల రే షన్‌కార్డులు ఉండగా ప్రజల విజ్ఞప్తి మేరకు మరో 3లక్షల 98వేల కొత్త కార్డుల ను సీఎం మంజూరు చేశారని అన్నారు. 90లక్షల రేషన్‌కార్డుల ద్వారా రెండు కోట్ల 90లక్షల మంది కుటుంబసభ్యులు లబ్ధిపొందుతున్నారని ఆయన అన్నా రు. గత పాలకులు కుటుంబంలో ఎంత మంది ఉన్నా ఐదు కిలోల చొప్పున న లుగురికే బియ్యం అందించేవారని, ప్రస్తుతం పరిమితి లేకుండా కుటుంబంలో ని అందరికీ ఆరు కిలోల చొప్పున అందిస్తున్నామన్నారు. తెలంగాణ అమలవు తున్న ఇలాంటి సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలని ఎంపీ అర్వింద్‌ను మంత్రి ప్రశ్నించారు. పేదరికానికి కులమతాలు అడ్డురావని, అందరూ సమానమేనని మంత్రి అన్నారు. రాష్ట్రంలో సీఎంఆర్‌ఎఫ్‌ మాదిరిగా పీఎంఆర్‌ఎఫ్‌ ఎంత మందికి ఇప్పించారో తెలపాలన్నా రు. తాను ఇప్పటి వరకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.7కోట్లు ఇప్పించానని, గడిచి న రెండేళ్ల రూ.3కోట్లు ఇప్పించానని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు మాట్లాడి తే హిందుత్వం పేరుతో మోసపూరిత రాజకీయానికి దిగుతున్నారని, జైశ్రీరాం ఓట్ల కోసం కాదని, గుండెల్లోంచి రావాలని ఆయన అన్నారు. తాను ఇప్పటి వ రకు నియోజకవర్గంలో 31ఆలయాలు నిర్మించానని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చే స్తున్నామని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడి పల్లెల రూపురేఖ లు మారాయన్నారు. కేసీఆర్‌ కిట్‌ ద్వారా ఆడబిడ్డలకు ఆర్థిక సహాయంతో పా టు తల్లీబిడ్డలకు కవాల్సిన వస్తువులు అందించామని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరూ అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాక ముందు ఎట్లుండే కేసీఆర్‌ హయాంలో జరుగుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీపీ ఏనుగంటి లావణ్య, జడ్పీటీసీ దాసరి లావణ్య, సర్పంచ్‌ బూస సునీత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:30:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising