ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN, First Publish Date - 2021-06-25T05:45:07+05:30

వచ్చే నెల 10వ తేదీన జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జి ల్లా ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి సాయిరమాదేవి తెలిపారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి సాయిరమాదేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి సాయిరమాదేవి
నిజామాబాద్‌ లీగల్‌, జూన్‌ 24: వచ్చే నెల 10వ తేదీన జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జి ల్లా ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి సాయిరమాదేవి తెలిపారు. జిల్లా న్యాయసేవా సదస్సు భవనంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజీ మార్గాన్ని రాజమార్గమని కక్షిదారులు గుర్తించి చాలా కేసులు పరిష్కరించి రాజీ కుదిర్చాలని ఆమె తెలిపారు. రాజీ కుదిర్చిన కేసు ల్లో గతంలో జిల్లా తెలంగాణలో రెండో స్థానం దక్కించుకుందని ఆమె తెలిపారు. ఈసారి కూడా ఎక్కువ కేసులు రాజీకి కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇం దుకు సంబంధించి పోలీసువారితో, ఇన్సూరెన్స్‌ కేసుల విషయమై బ్యాంక్‌ మేనేజర్‌లతో కూడా మాట్లాడామని తెలిపారు. ఈ రాజీ మార్గం కరోనా సమయంలో వర్చువల్‌గా కూడా ఏర్పాట్లు చేయనున్నామన్నారు. కక్షిదారులు వర్చువల్‌గా కుదరనివారు వచ్చే నెల 1 నుంచి 10 వరకు జిల్లా న్యాయసేవా సదన్‌కు నేరుగా వచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి జె.విక్రమ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-25T05:45:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising