ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారం కోసమే హత్య

ABN, First Publish Date - 2021-04-12T06:10:52+05:30

మోర్తాడ్‌ శివారులోని జాతీయరహదారి పక్కన గు ర్తుతెలియని మహిళ హత్య కేసును 15 రోజుల్లో ఛేదించడం జరిగిందని డీసీపీ కేసీఎస్‌.రఘువీర్‌ అన్నారు.

వివరాలు వెల్లడించిన డీసీపీ రఘువీర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోర్తాడ్‌, ఏప్రిల్‌11: మోర్తాడ్‌ శివారులోని జాతీయరహదారి పక్కన గు ర్తుతెలియని మహిళ హత్య కేసును 15 రోజుల్లో ఛేదించడం జరిగిందని డీసీపీ కేసీఎస్‌.రఘువీర్‌ అన్నారు. ఆదివారం మోర్తాడ్‌ పోలీస్‌స్టేషన్‌లో హత్యకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. నిందితు లు నిజామాబాద్‌ మండలం నాగారానికి చెందిన పల్లపు మల్లేష్‌, పల్లపు హరికృష్ణ, కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్‌ గ్రామస్థురా లు గద్దెరాజు సత్తెవ్వను దారుణంగా హత్య చేశారని తెలిపారు. నిందితు లు పాత నేరస్థులని అన్నారు. పల్లపు మల్లేష్‌ నిజామాబాద్‌, కామారెడ్డి బస్టాండ్‌లో గంజాయి ప్యాకెట్లు విక్రయించేవాడని, ఒంటరి మహిళలను స్నేహం చేసుకొని ఆమెతో సంబంధం పెట్టుకుని బంగారం కోసం హత్య చేసేవాడని తెలిపారు. హతురాలు సత్తెమ్మతో వివాహేతర సంబంధం పె ట్టుకున్నాడని వివరించారు. ఆమెపై ఉన్న బంగారం దొంగిలించాలనే ఉద్దే శంతో అతని తమ్ముడి కుమారుడు పల్లెపు హరికృష్ణతో కలిసి గత నెల 26న ఆమెను కారులో తీసుకొని బయలుదేరినట్లు చెప్పారు. ఆమెకు బా గా తాగించి హత్య చేయాలని చూశారని, చివరికి వీలు కాకపోవడంతో కారులోనే బీరుబాటిళ్లతో పొడిచి హత్య చేశారని డీసీపీ తెలిపారు. మృతదేహాన్ని మోర్తాడ్‌ శివారులోని జాతీయరహదారి పక్కన పడవేశారని తె లిపారు. ఈ కేసు విచారణ నిమిత్తం భీమ్‌గల్‌ సీఐ శ్రీకాంత్‌రెడ్డి, మోర్తాడ్‌ ఎస్సై సురేష్‌, కానిస్టేబుళ్లు సుధాకర్‌, ప్రదీప్‌, హోంగార్డు, నర్సయ్య, గు రునాథ్‌లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారని తెలిపారు. నిందితులను శనివారం సాయంత్రం అరెస్టు చేశామన్నారు. నిందితుడు పాలెపు మల్లే ష్‌ గతంలో రెండు హత్యలు, చైన్‌స్నాచింగ్‌, దొంగతనాలు వంటి 17 కేసు లు ఉన్నాయని వివరించారు. హత్య కేసును 15రోజుల్లో ఛేదించిన టీం సభ్యులను అభినందించారు. నిందితుల నుంచి బంగారు పుస్తెల తాడు, చెవికమ్మలు, రూ.1500నగదు, మారుతి కారును స్వాధీనం చేసుకున్నామ ని తెలిపారు. నిందితుడు గతంలో సిద్దిపేట్‌ జైలుకు తరలిస్తుండగా పో లీసుల నుంచి పిస్తోలు తీసుకొని పారిపోయాడని తెలిపారు. మాక్లూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కూడా పల్లెపు హరికృష్ణ దోపిడి కేసులో నిందితుడ ని తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు రివార్డు కోసం అధికారు లకు ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ రఘు, సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సై సురేష్‌, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-12T06:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising