ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు

ABN, First Publish Date - 2021-06-23T05:57:44+05:30

రైతులకు ఎల్లవేళలా వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతీ క్లస్టర్‌కు ఒక రైతు వేదిక భవనాన్ని నిర్మించింది. క్లస్టర్‌ పరిధిలోని రైతులకు అధికారులు క్లస్టర్‌లో ఉండి సేవలు అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. కాని అధికారుల తీరు

కృష్ణాజివాడిలో తాళం వేసి ఉన్న రైతు వేదిక కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో పలుచోట్ల తెరుచుకోని రైతు వేదిక కార్యాలయాలు 

వృథాగా మారిన భవనాలు!! 

పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు

తాడ్వాయి, జూన్‌ 22: రైతులకు ఎల్లవేళలా వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతీ క్లస్టర్‌కు ఒక రైతు వేదిక భవనాన్ని నిర్మించింది. క్లస్టర్‌ పరిధిలోని రైతులకు అధికారులు క్లస్టర్‌లో ఉండి సేవలు అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. కాని అధికారుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రూ.22 లక్షలతో నిర్మించిన రైతువేదిక భవనాలను అధికారులు తెరవడం లేదు కదా కనిసం కన్నెతి చూడడం లేదు. దీంతో రైతులకు సరైన సూచనలు,సలహలు అందడం లేదు. తాడ్వాయి మండ లం కృష్ణాజీవాడిలో నిర్మించిన రైతు వేదిక భవనం ప్రతీరోజు తాళం వేసి ఉం టుంది. ఒక్క కృష్ణాజివాడిలోనే కాకుండా మిగతా క్లస్టర్‌లలోని రైతువేదిక భవనాలు సైతం తెరుచుకోవడం లేదు.దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సైతం చాలారైతు వేదిక భవనాలను తాళం వేసి ఉంచుతున్నారు. భవనం తెరువడం లేదు. లక్షల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రయోజనం లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి భవనాలు తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎవో శ్రీకాంత్‌ను ‘ఆంద్రజ్యోతి’ వివరణ కోరగా.. ఏఈవోలు రైతువేదిక భవనాల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2021-06-23T05:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising