ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగల దొంగ అరెస్టు

ABN, First Publish Date - 2021-04-13T06:09:15+05:30

నగరంలోని 3వ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆగస్టు 16, 2020న జరిగిన దొంగతనం కేసులో పాత నేరస్తుడు కందికంటి రాజాగౌడ్‌ను అరెస్టుచేసినట్లు 3వ టౌన్‌ ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖిల్లా, ఏప్రిల్‌ 12: నగరంలోని 3వ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆగస్టు 16, 2020న జరిగిన దొంగతనం కేసులో పాత నేరస్తుడు కందికంటి రాజాగౌడ్‌ను అరెస్టుచేసినట్లు 3వ టౌన్‌ ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు. నాందేవ్‌వాడకు చెందిన ఏడి లక్ష్మి తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పాత నేరస్తుడు కందికంటి రాజాగౌడ్‌గా గుర్తించామని తెలిపారు. కానీ అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నా డని, సోమవారం రోటరినగర్‌లోని తన కిరాయి ఇంట్లో ఉన్నాడన్న సమాచారం మేరకు దాడిచేయ గా నిందితుడు పట్టుబడ్డాడని, విచారించగా తన నేరాన్ని ఒప్పుకున్నాడని ఎస్‌ఐ తెలిపారు. సుభాష్‌నగర్‌లోని అన్విత అరుణోదయ అపార్ట్‌మెంట్‌లో మధుసూదన్‌రావు ఇంట్లో కూడా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని, ఈ రెండు కేసుకు సంబంఽ దించి బంగారు ఆభరణాలతో పాటు నగదు రూ.15 వేలను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కేసుల్లో ప్రతిభకనబర్చిన ఎస్‌ఐతోపాటు కానిస్టేబుల్‌ అప్సర్‌ను సీఐ సత్యనారాయణ అభినందించారు. 

Updated Date - 2021-04-13T06:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising