ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగమడుగు లిఫ్ట్‌తో 40వేల ఎకరాలకు సాగు నీరు

ABN, First Publish Date - 2021-02-12T05:30:00+05:30

జుక్కల్‌ నియోజకవర్గం లోని పిట్లం, నిజాంసాగర్‌, పెద్దకొడప్‌గల్‌ మండ లాల్లోని బీడు భూములు నాగమడుగు ఎత్తిపో తల పథకంతో సాగులోకి వస్తాయని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే

పిట్లం, ఫిబ్రవరి 12: జుక్కల్‌ నియోజకవర్గం లోని పిట్లం, నిజాంసాగర్‌, పెద్దకొడప్‌గల్‌ మండ లాల్లోని బీడు భూములు నాగమడుగు ఎత్తిపో తల పథకంతో సాగులోకి వస్తాయని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమేష్‌ అధ్యక్షతన సమావే శాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మె ల్యేను టీఆర్‌ఎస్‌  మండల నాయకులు ఘనంగా సన్మానించారు. నాగమడుగు ఎత్తిపోతల పథకా న్ని రూ.476.25 కోట్లతో పూర్తి చేయనున్నామన్నా రు. పిట్లం మండలానికి 30చ పడకల ఆసుపత్రి, డీగ్రి కళాశాల, బాన్సువాడ-పిట్లం రెండు వరుస ల రహదారి పనులు త్వరలో చేపడుతామన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ నాగమడుగు ఎత్తిపోతల ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్‌ రెడ్డి, సర్పంచ్‌ విజయలక్ష్మి, మండల టీఆర్‌ఎస్‌ అఽధ్యక్షుడు రమేష్‌, ఏఎమ్‌సీ చైర్మెన్‌ సుధాకర్‌ రావ్‌, నాయకులు వెంకట్‌రాంరెడ్డి, నాయకులు వి జయ్‌, నవీన్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మహిళలకు ఎంతో గౌరవం లభిస్తోంది

నిజాంసాగర్‌: తెలంగాణ ఏర్పాటైయ్యాక మ హిళలకు ఎంతో గౌరవం లభిస్తోందని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్త లకు ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి అధ్యక్షతన ఉచిత చీరల పంపిణీ చేశారు. మహిళలను అన్నిరం గాల్లో ముందుకు తీసుకెళుతున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారన్నా రు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలతో ఆ దుకుంటున్నారని తెలిపారు. కరోనా టీకాలను ప్ర తి ఒక్కరూ వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పీ చైర్‌పర్సన్‌ దఫెదార్‌ శోభ రాజు, ఎంపీ పీ జ్యోతి దుర్గారెడ్డి, పీడీ అనురాధ, ఏఎంసీ ఉపాధ్యక్షుడు గైనివిఠల్‌, సీడీసీ చైర్మన్‌ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేష్‌ గౌడ్‌, ఎంపీడీవో పర్బన్న, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు విజయ లక్ష్మీ, తదితరులున్నారు.

Updated Date - 2021-02-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising