ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2021-10-25T05:05:42+05:30

నేటి నుంచి ఇంట ర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏ ర్పాట్లు చేశారు.

నగరంలోని ఓ పరీక్ష కేంద్రాన్ని సానిటైజ్‌ చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు

నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 24: నేటి నుంచి ఇంట ర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏ ర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల ను ఈనెల 25 నుంచి నవంబరు 3 వరకు నిర్వహించేం దుకు ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం ఇంటర్‌ మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లావ్యాప్తంగా 18,697 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 71 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశారు. ముఖ్యంగా కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని భౌ తికదూరం పాటిస్తూ పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. సా నిటైజర్‌లు, మాస్కులను అందుబాటులో ఉంచారు. ప్రతీపరీక్ష కేంద్రంలో ఐసోలేషన్‌ గదులను సిద్ధంగా ఉంచారు. ఎవరైనా విద్యార్థులు అనారోగ్యంతో ఇబ్బంది పడితే వారికి ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 9గంట ల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నిమిషం నిబంధన ఉండడంతో విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాలలో మాస్‌ కా పీయింగ్‌ నిరోదానికి 144 సెక్షన్‌ను విధించారు. పరీక్ష స మయాలలో పరీక్ష కేంద్రం చుట్టుపక్కల జిరాక్స్‌ సెంటర్‌లను మూసిఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 71 పరీక్ష కేంద్రాలలో పరీక్షల నిర్వహణకు 71 మ ంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 71 మంది డిపార్ట్‌మెంట ల్‌ అధికారులను నియమించారు. మాస్‌ కాపీయింగ్‌ను నిరోదించడానికి ఒక హైపవర్‌ కమిటీతో పాటు 3 ఫ్లయిం గ్‌ స్క్వాడ్‌ బృందాలు, 5 సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ని యమించారు. విద్యార్థులను డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్లతో అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఇంటర్మీడియట్‌ అధికారులు స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-25T05:05:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising