ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాంత్రీకరణ అమలులో అవకతవకలపై ఉన్నతాధికారుల విచారణ

ABN, First Publish Date - 2021-03-06T04:56:22+05:30

వ్యవసాయశాఖలో పదేళ్ల క్రితం జరిగిన యాంత్రీకరణ అమలు లో అవకతవకలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. విజిలెన్స్‌ నివేదిక ఇవ్వడంతో ఆ శాఖ అదనపు డైరె క్టర్‌ జిల్లా కార్యాలయానికి వచ్చి తనిఖీలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌, మార్చి 5: (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వ్యవసాయశాఖలో పదేళ్ల క్రితం జరిగిన యాంత్రీకరణ అమలు లో అవకతవకలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. విజిలెన్స్‌ నివేదిక ఇవ్వడంతో ఆ శాఖ అదనపు డైరె క్టర్‌ జిల్లా కార్యాలయానికి వచ్చి తనిఖీలు చేశారు. అప్పుడు జరిగిన ఫార్మ్‌ మెకనైజేషన్‌కు వెచ్చించిన నిధుల వివరాలను పరిశీలించారు. ఐ దుగురు ఏవోల పరిధిలో జరిగిన అవకతవకలపైన విచారణ చేపట్టా రు. ఆ సమయంలో యాంత్రీకరణ ద్వారా యంత్రాలను కొని అందించడంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. జిల్లాలో 2010 నుంచి 2012 మ ధ్య జరిగిన ఈ పనులపైన ప్రస్తుతం విచారణను కొనసాగిస్తున్నారు. వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ శుక్రవారం జేడీఏ కార్యాలయా నికి వచ్చి విచారణ చేపట్టారు. అప్పటి రికార్డులను పరిశీలించారు. ఆ అధికారుల పరిధిలో పథకం అమలుతీరు వివరాలను తెలుసుకున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఏయే మండలాల్లో యాంత్రీకరణ కోసం నిధులు ఖర్చు పెట్టారో పరిశీలించారు. తమ నివేదికను వ్యవసాయశాఖ కమిషనర్‌ కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తుపైన అధికారులు మాత్రం వివరాలను వెల్లడించలేదు.

Updated Date - 2021-03-06T04:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising