ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి హామీలో కూలీల సంఖ్యను పెంచాలి

ABN, First Publish Date - 2021-05-08T05:26:23+05:30

నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లి మండలాన్ని ఉపాధిహామీలో కూలీల సంఖ్యను పెంపుచేస్తూ అగ్రగామిగా ఉంచాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉందని డీఆర్‌డీవో పీడీ చందర్‌నాయక్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, మే 7: నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లి మండలాన్ని ఉపాధిహామీలో కూలీల సంఖ్యను పెంపుచేస్తూ అగ్రగామిగా ఉంచాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉందని డీఆర్‌డీవో పీడీ చందర్‌నాయక్‌ అన్నారు. శుక్రవారం డిచ్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి హామీ పనుల తీరుతెన్నులపై సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మోపాల్‌, భీమ్‌గల్‌, బోధన్‌ ప్రాంతాల్లో 3 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులు చేసుకోడానికి వస్తుంటే డిచ్‌పల్లిలో 1500ల మంది కూలీలు మా త్రమే రావడం తగదని ఉపాధిహామీ సిబ్బంది పనితీరుపై పీడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. బర్దీపూర్‌, ఆరె పల్లి, దూసుగాం గ్రామాల్లో ఉపాధి హామీ పనులు న త్తనడకన జరుగుతున్నాయని సంఖ్య పెంపుచేయకపో తే చర్యలు తప్పవన్నారు. ఇప్పటి వరకు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు 50శాతం కూడా పూర్తికాలేవని ఏపీవో ఓం కార్‌పై ఆయన మండిపడ్డారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులతో ఉపాధి హామీ పనులపై ఎప్పటికప్పుడు స మీక్షించి పనులు మరింత వేగవంతం చేయాలని కూలీలు భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు. డిచ్‌పల్లి మండలంలో ఉపాధిహామీ పనులు వేగంగా నడిస్తేనే కంప్యూటర్‌ ఆపరేటర్‌ నియమిస్తామని అందుకు అనుగుణంగా ఉపాధి హామీ సిబ్బంది గ్రామాల్లో కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొనేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నత్తనడకన జరిగితే సిబ్బందిని బాధ్యులను చేస్తామని కూలీల సంఖ్య పెంపు చేయాలన్నారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పనులు జరిగేలా చూడాలన్నారు. అనంతరం డీఆర్‌డీఏ పీడీ చందర్‌నాయక్‌ అమృతాపూర్‌ గ్రామంలో కొవిడ్‌ ఇంటింటి సర్వే ఆయన స్వయంగా పరిశీలించారు. కొవిడ్‌ సోకినవారు ధైర్యాన్ని కోల్పోకుండా వైద్యులు తెలిపే సూచనలు పాటించాలని కోరారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి వివరాలను వైద్యాధికారి బాబురావును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీవో రామకృష్ణ, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T05:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising