ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడ్డి మందు కొడితే.. మొక్కజొన్న పంట మాడిపోయింది

ABN, First Publish Date - 2021-07-28T05:55:22+05:30

మండలంలోని బేగంపూర్‌ గ్రామానికి చెందిన మహిళా రైతు పీరవ్వ కాస్లాబాద్‌ శివారులో ఒక ఎకరంలో సోయా పంట, ఒక ఎకరంలో మొక్కజొన్న పంటను వేసింది.

పెద్ద కొడప్‌గల్‌లో ఏవోను నిలదీస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుకాణదారుడిని నిలదీస్తే.. వత్తాసు పలికిన ఏవో
ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. న్యాయం చేయాలని డిమాండ్‌

పెద్ద కొడప్‌గల్‌, జూలై 27: మండలంలోని బేగంపూర్‌ గ్రామానికి చెందిన మహిళా రైతు పీరవ్వ కాస్లాబాద్‌ శివారులో ఒక ఎకరంలో సోయా పంట, ఒక ఎకరంలో మొక్కజొన్న పంటను వేసింది. కాగా, గడ్డి బాగా పెరగడంతో గడ్డి మందు కోసం పెద్ద కొడప్‌గల్‌లోని దుకా ణంలో గడ్డి మందు తీసుకోగా, సోయా, మొక్కజొన్న పంటకు అదే మందు పని చేస్తోందని దుకాణ యజమాని ఇచ్చాడు. దీంతో గడ్డి మం దు కొట్టగా మొక్కజొన్న పంట పూర్తిగా మాడిపోయిందని, దీంతో మహిళా రైతు దుకాణదారుడిని మంగళవారం అడుగగా, దురుసుగా సమాధా నం ఇచ్చినట్లు తెలిపారు. రైతులంతా కలిసి దుకాణం ముందు నిరసన తెలుపగా, సంబంధిత ఏవో నజీముద్దీన్‌ అక్కడికి చేరుకుని, దుకాణదా రునికి వత్తాసు పలికాడు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి రాని ఏవో దుకాణ దారునికి వత్తాసు పలకడం వెనుక మతలబు ఏంట ని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు మహిళా రైతుకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏవో గ్రామాలకు వచ్చి ఏ ఒక్కరోజు రైతులకు అవగాహన కల్పించిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఏ పంటలు వేయాలని, చీడపీడల నివారణకు ఏ మందులు వాడాలో తెలియజేయడం లేదన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి రైతుకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూడాలన్నారు.

Updated Date - 2021-07-28T05:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising