జిల్లావ్యాప్తంగా మోస్తారు వర్షాలు
ABN, First Publish Date - 2021-08-31T06:33:34+05:30
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఉపరితల అవర్తన ద్రోణిలతో జిల్లాలో వర్షా లు పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో జల్లులతో కూడిన వర్షం పడుతుండ గా మరికొన్ని గ్రామాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతు న్నాయి. జిల్లా అంతటా
అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలు
పలు గ్రామాలలో ఏకధాటిగా జల్లులు
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ఎస్సారెస్పీకి భారీగా వరద.. 12 గేట్ల ఎత్తివేత
నిజామాబాద్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఉపరితల అవర్తన ద్రోణిలతో జిల్లాలో వర్షా లు పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో జల్లులతో కూడిన వర్షం పడుతుండ గా మరికొన్ని గ్రామాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతు న్నాయి. జిల్లా అంతటా ఈ వర్షాలు పడటంతో కొన్ని గ్రామాల పరిదిలో వాగులు పొంగుతున్నాయి. జిల్లాలోని పలు చెరువులు ఈ వర్షాలతో అలుగులు పారుతున్నాయి. ఎస్సారెస్పీకి కూడా వరద పెరుగుతోంది.
మళ్లీ మొదలైన వర్షాలు
జిల్లాలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు గ్రామాల పరిదిలో సోమవారం వర్షాలు పడ్డాయి. ఈ అల్పపీడంకు ఉపరితల అవర్తన ద్రోఫి తోడవ్వడం తో కొన్నిచోట్ల ఎక్కువగా వర్షం పడింది. జిల్లాలో 12.1 మిమీ వర్షం పడిం ది. చందూర్ మండలంలో 52.8 మిమీ వర్షం పడింది. జిల్లాలో జూన్ నుంచి ఇప్పటి వరకు 716.4 మిమీల వర్షం పడాల్సి ఉండగా ఇప్పటి వర కు 946.8 మిమీ వర్షం పడింది. జిల్లాలోని 29 మండలాలు ఉండగా 27 మండలాలలో సాదారణ వర్షానికి మించి వర్షం పడింది. జిల్లాలో పడు తున్న ఈ వర్షాలతో పలు గ్రామాలలోని వాగులలో నీళ్లు పొంగుతున్నా యి. చెరువులు అలుగులు పారుతున్నాయి. జిల్లాలో 965 చెరువులు ఉం డగా 825 పైగా చెరువులు అన్ని నిండిపోయాయి. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మరో రెండు నుంచి మూడు రోజుల వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ నరేందర్ తెలిపారు.
శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 37వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో 1091 అడుగుల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టులో పూర్తిస్థారస కెపాసిటీలో 90.313 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం కాకతీయ, లక్ష్మీ, సరస్వతి, గుత్ప, అలీసాగర్‌తో పాటు జెన్ కో కలిపి ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు పడుతున్నందున వరద పెరిగే అవకాశం ఉన్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.
ఎస్సారెస్పీ 12 గేట్ల ఎత్తివేత
మెండోర: శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కు ప్రాజెక్టులోకి క్రమంగా వరదనీరు చేరుతుండడంతో మొదట రెండు గేట్లను ఎత్తి 6240క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు లోకి ఇన్‌ఫ్లో పెరగడంతో 12 గేట్లను ఎత్తి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న 37 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోను గోదావరి నదిలోకి వదులుతున్న ట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాస్ తెలిపారు. అనంతరం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను ఆర్డీవో శ్రీనివాసులు ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో నుంచి ఐదు ఎస్కేప్ గేట్ల ద్వారా ఐదు వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. లక్ష్మీ కాలువకు 180 క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 117 క్యూసెక్కులు, గుత్ప, అలీసాగర్‌కు 674క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మిషన్ భగీరథకు 152 క్యూసెక్కులు అవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీటి ఔట్‌ఫ్లో వెళ్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుత నీటిమట్టం 1091.00 అడుగులు (90.313టీఎంసీ) నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
భారీ వర్షాలకు తెగిన వంతెన
ఇందల్‌వాయి: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ఇందల్‌వాయి చిన్నవాగు వంతెన తెగిపోయిందని స్థానికులు తెలిపారు. గత రెండేళ్ల నుంచి ప్రమాదకరంగా ఉన్న వంతెన ఈ వర్షాల తో వరద నీటి ఉధృతికి వంతెన తెగిపోయింది. దీంతో ఇందల్‌వాయి నుంచి ఇందల్‌వాయితండా, త్రియంబక్‌పేట్, గండితండా, రంజిత్‌నాయక్‌తండా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Updated Date - 2021-08-31T06:33:34+05:30 IST