ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లు సరే.. కేటాయింపులెప్పుడు?

ABN, First Publish Date - 2021-04-06T06:05:58+05:30

జిల్లాలో సహకార సంఘాలు, మార్కెట్‌ కమిటీలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభిస్తున్నప్పటికీ.. కొను గోళ్లు మాత్రం ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో ధాన్యం తరలింపునకు నేటికీ పూర్తికాని రైస్‌ మిల్లుల కేటాయింపు

కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లకు తప్పని బ్రేక్‌

రైస్‌ మిల్లులు కేటాయిస్తేనే కొంటామంటున్న అధికారులు

జిల్లాలో జోరుగా సాగుతున్న వరి కోతలు

బోధన్‌, ఏప్రిల్‌ 5: జిల్లాలో సహకార సంఘాలు, మార్కెట్‌ కమిటీలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభిస్తున్నప్పటికీ.. కొను గోళ్లు మాత్రం ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ కొనుగోళ్లు ప్రారంభించినా రైస్‌ మిల్లులకు కేటాయింపులు జరిగే వరకు సహకార సొసైటీలు, మార్కెట్‌ కమిటీలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాల వారీగా రైస్‌ మిల్లు ల కేటాయింపు జరపకపోవడంతో ఇంకా సహకార సొసైటీలు, మార్కెట్‌ క మిటీలకు రైస్‌ మిల్లుల కేటాయింపుపై అధికారిక ఉత్తర్వులు అందలేదు. తూకం వేసిన ధాన్యాన్ని ఏ రైస్‌ మిల్లుకు తరలించాలో స్పష్టత లేకపోవడ ంతో కొనుగోలు కేంద్రాల ప్రారంభ ప్రక్రియ పూర్తిస్థాయి రూపం దాల్చుకో లేదు. కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లను జరపకుండానే వేచి చూడాల్సి న పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని అన్ని మండలాల్లో గత మూడు నాలుగు రోజుల నుంచి సహకార సొసైటీలు, మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో ధా న్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రా రంభం అవుతున్నా.. ఇప్పటి వరకు రైస్‌ మిల్లుల కేటాయింపు లేకపోవడం తో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మరోవైపు బోధన్‌ డివిజన్‌ పరిధిలో గత 15 రోజులుగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. యంత్రాలతో కోతలు కొనసాగుతుండడంతో ఉదయం చూసిన పంట పొలాలు సాయం త్రానికి కోతలు ముగిసి వరి ధాన్యం రాశులు రోడ్లపైకి వచ్చి పడుతున్నా యి. ఇప్పటికే జిల్లాలో కిలో మీటర్ల పొడవునా రోడ్లపైన ధాన్యం రాశులు ఆరబోసి రైతులు విక్రయాల కోసం ఎదురు చూస్తున్నారు. వారం రోజులు గా ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసిన రైతులు కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్ల ను వేగవంతం చేయాలని వేడుకుంటు న్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారం భిం చి ఏం లాభమని, కేంద్రాలు ప్రారంభిస్తే నే లక్ష్యం నేరవేరుతుందా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రా ల ప్రారంభం పేరుకే కాకుండా కొనుగోళ్లు జరిగేలా చూడాలని రైతులు కో రుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా మండలాల వారీగా సహకార సొసైటీలకు, మార్కెట్‌ కమిటీలకు రైస్‌ మిల్లులను కేటాయించి, అధికారికంగా ఉత్తర్వులను జారీ చేస్తే కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. లేనిఎడల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా రైస్‌ మిల్లుల కేటాయింపు లు లేక కొనుగోళ్లు జరగడం లేదన్న ప్రచారం జరిగే అవకాశం ఉంది. మరో వైపు కొనుగోలు కేంద్రాలలో హమాలీల కొరత, హమాలీల ఛార్జీలు, గన్నీ బస్తాలు ఇతర సమస్య లన్నింటినీ అధికారులు వేగవంతంగా పరిష్కరిం చాల్సి ఉంది. లేనట్లయితే కొనుగోలు ప్రక్రియకు మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. 

ఇంకా రైస్‌ మిల్లుల కేటాయింపు జరగలేదు

- నారాయణ, సీఈవో, కోటగిరి సహకార సొసైటీ)

కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా ఇంకా రైస్‌ మిల్లుల కేటాయింపుపై అధికారికంగా ఉత్తర్వులు అందలేదు. రైస్‌ మిల్లుల కేటాయింపు జరిగితేనే కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రైస్‌మిల్లు అలాట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నాం. రైస్‌ మిల్లుల కేటాయి ంపు జరిగేంత వరకు ధాన్యం కొనుగోళ్లు జరిపే పరిస్థితి లేదు. కొన్న ధా న్యాన్ని ఏ రైస్‌మిల్లుకు పంపాలో స్పష్టత ఉంటే కొనుగోలు చేస్తాం.

Updated Date - 2021-04-06T06:05:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising