ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూడ్స్‌ రైలు ఢీకొని 52 గొర్రెల మృతి

ABN, First Publish Date - 2021-10-29T06:21:16+05:30

అంక్సాపూర్‌ శివారులో గూడ్స్‌ రైలు ఢీకొని 52గొర్రెలు మృతి చెం దాయి. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి, అంక్సాపూర్‌కు చెందిన గొల్ల భోజన్న, ఆయన కుమారుడు చొన్న భోజేందర్‌ వారికి చెందిన గొర్రెలను నిత్యం లాగే గురువారం మేతకు తీసుకువెళ్లారు. అంక్సాపూర్‌ శివారులో కుకునూర్‌ గ్రామానికి వెళ్లే రోడ్డులోని 44వ జాతీయ రహదారి వంతెన కింద రైలు పట్టాలకు ఇరువైపులా గొర్రెలు మేత మేస్తున్నాయి. సాయంత్రం సుమారు 4గంటల సమయంలో కరీంనగర్‌ వైపు నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు గొర్రెలను ఢీకొని వెళ్లింది. పట్టాలు లోయ ప్రాంతంలో ఉండడంతో గొర్రెలకు ఎటూ వెళ్లడానికి వీలు లేకుండా పోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేల్పూర్‌, అక్టోబరు28: అంక్సాపూర్‌ శివారులో గూడ్స్‌ రైలు ఢీకొని 52గొర్రెలు మృతి చెం దాయి. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి, అంక్సాపూర్‌కు చెందిన గొల్ల భోజన్న, ఆయన కుమారుడు చొన్న భోజేందర్‌ వారికి చెందిన గొర్రెలను నిత్యం లాగే గురువారం మేతకు తీసుకువెళ్లారు. అంక్సాపూర్‌ శివారులో కుకునూర్‌ గ్రామానికి వెళ్లే రోడ్డులోని 44వ జాతీయ రహదారి వంతెన కింద రైలు పట్టాలకు ఇరువైపులా గొర్రెలు మేత మేస్తున్నాయి.  సాయంత్రం సుమారు 4గంటల సమయంలో కరీంనగర్‌ వైపు నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు గొర్రెలను ఢీకొని వెళ్లింది. పట్టాలు లోయ ప్రాంతంలో ఉండడంతో గొర్రెలకు ఎటూ వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. దీంతో రైలు ఢీకొని 52 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో రూ.5లక్షల వరకు నష్టం జరిగినట్టు బాధితులు వాపోయారు. అంక్సాపూర్‌ సర్పంచ్‌ ఎడ్ల రాజేశ్వర్‌రెడ్డి అందించిన సమాచారం మేరకు తహసీల్దార్‌ సతీష్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. 

Updated Date - 2021-10-29T06:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising