ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడిపోయిన టమాట ధర

ABN, First Publish Date - 2021-01-18T05:45:47+05:30

టమాట ధర ఒక్కసారిగా పడి పోయింది. నెల రోజుల క్రితం రూ.40 నుంచి రూ.50 పలికి న టమాట ప్రస్తుతం రూ.15 నుంచి రూ.10లకు తగ్గిపోయి ంది. సంక్రాంతి తర్వాత ధర తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లోని సంతలలో రూ.5లకు కిలో విక్రయిస్తున్నారు.

ఎల్లారెడ్డి మార్కెట్‌కు రైతులు తెచ్చిన టమాట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టణాల్లో కిలో రూ.10, పల్లెల్లో రూ.5

పెట్టుబడులు కూడా రాని పరిస్థితి  

ఉత్పత్తి పెరగడమే ధర పతనానికి కారణం

ఎల్లారెడ్డి, జనవరి 17: టమాట ధర ఒక్కసారిగా పడి పోయింది. నెల రోజుల క్రితం రూ.40 నుంచి రూ.50 పలికి న టమాట ప్రస్తుతం రూ.15 నుంచి రూ.10లకు తగ్గిపోయి ంది. సంక్రాంతి తర్వాత ధర తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లోని సంతలలో రూ.5లకు కిలో విక్రయిస్తున్నారు. ఆదివారం కా మారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని వారాంతపు సంతలో కిలో టమాట రూ.5లు మాత్రమే పలకడంతో వ్యాపారులు దిగులు చెందారు. ఈ ఏడు టమాట నారు 20పైసలకు ఒ క్క మొక్క ఉండడంతో ఎక్కువ మంది రైతులు టమాట పంట పండించడానికి మొగ్గు చూపారు. అందులో భాగం గానే ఉత్పత్తి పెరిగి టమాట ధర తగ్గిపోయిందని అధికారు లు పేర్కొంటున్నారు.

సాగు విస్తీర్ణం పెరగడంతో..

టమాట ధర తగ్గడానికి కారణం సాగు విస్తీర్ణం పెరగ డమేనని ఉద్యాన వన శాఖ అధికారులు చెబుతున్నారు. గ తంలో సాగు విస్తీర్ణం తక్కువగా ఉండేదని, ప్రస్తుతం రైతు లు ఎక్కువగా సాగుచేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ సా రి వాతావరణం అనుకూలంగా ఉందని, పూతరాలే సమయ ంలో అనుకూలమైన వాతావరణం ఉండడంతో ఎక్కువ ది గుబడి వచ్చిందని వివరిస్తున్నారు.

నష్టం మిగిల్చిన టమాట

ఈ సారి ఒక్కసారిగా ధర తగ్గడంతో టమాట సాగు చే సిన రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిం ది. పంటను మార్కెట్‌కు తరలిస్తే ఆటో చార్జీలు కూడా రావ డం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ కంటే ముందు ఉన్న ధర ప్రస్తుతం లేదని, తమకు అప్పులు తప్ప మరేమీ మిగలలేదని వాపోతున్నారు. 

Updated Date - 2021-01-18T05:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising