ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ABN, First Publish Date - 2021-07-25T05:00:57+05:30

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భాగస్వాములు కావాలని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు.

బాన్సువాడలో మొక్క నాటి నీరు పోస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాన్సువాడ, జూలై 24: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భాగస్వాములు కావాలని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. బాన్సువా డ పట్టణంలోని తాడ్కోల్‌ చౌరస్తాలో ముక్కోటి వృక్షార్చనలో భాగంగా కలెక్టర్‌ శరత్‌, ప్రజా ప్రతినిధులతో కలిసి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పట్టణంలోని తాడ్కోల్‌ చౌరస్తా, తాడ్కోల్‌ గ్రామం, సంగమే శ్వర కాలనీ, తదితర చోట్ల మొక్కలు నాటారు. అనంతరం కాలినడకన బ్యాటరీ వాహనంలో ఆయన పర్యటిస్తూ నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సంద ర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ ఇచ్చిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చనలో స్పీకర్‌ హోదాలో కాకుండా నియోజకవర్గంలో సామాజిక సేవలో భాగంగా సామాజిక కార్యకర్తగా మొక్కలు నాటిన ట్లు ఆయన తెలిపారు. మానవునికి ప్రాణవాయువు వృక్షాలేనని, అలాంటి వృక్షాలను పెంచాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. మానవ మనుగడకు వృక్షాలు ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటేందు కు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఆరు విడతలుగా నాటడం జరుగుతుందన్నారు. కామారెడ్డి జిల్లాలో 15లక్షల మొక్కలు నాటుతున్నామన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 3 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో లక్ష మొక్కలు, మండ లాల పరిధిలో 5,500 మొక్కలు, వార్డుల వారీగా 500 మొక్కలను నాటే ప్రణాళికను సిద్ధం చేసి, అమలు చేస్తు న్నామన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున నాటి సంరక్షించాలని ఆయన సూచిం చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శరత్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, జిల్లా ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్‌ ఏర్వల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్‌, ఏఎంసీ చైర్మన్‌ పాత బాలకృష్ణ, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాం రెడ్డి, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, ఎజాస్‌, బాడీ శ్రీనివాస్‌, బాబా, కనుకుట్ల రాజు, కౌన్సిలర్లు, తదితరు లున్నారు.  
అంతరించిపోతున్న అడవులు
నిజాంసాగర్‌: మండలంలోని గాలిపూర్‌ శివారులో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో 2 కోట్ల 75 హెక్టార్ల భూ విస్తరణ ఉంద ని, కోటి 50 లక్షల భూములు సాగులో ఉండగా, 56 లక్షల అటవీ భూములున్నాయని, అటవీ భూముల్లో చెట్లు అంతరించిపోవడంతోనే అడవుల్లో చెట్లు కరువయ్యాయని, దీని పూడ్చడానికే సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమా న్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దఫెదార్‌ శోభ, ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి తదితరులున్నారు.
కామారెడ్డి: పట్టణంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
సదాశివనగర్‌: మండలంలోని భూంపల్లి అంబరిషుని గుట్టపై ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందితేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. 6 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న హరితహరం కార్యక్రమం ఇప్పుడిప్పుడే ఫలితాలను అందిస్తుందన్నారు.

Updated Date - 2021-07-25T05:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising