ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి

ABN, First Publish Date - 2021-04-09T05:41:16+05:30

కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ జా గ్రత్తలు పాటించాలని బోధన్‌ ఏసీపీ రామారావు అన్నారు. మండల కేంద్రంలో గురువారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.

అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఏసీపీ రామారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎడపల్లి, ఏప్రిల్‌ 8 : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ జా గ్రత్తలు పాటించాలని బోధన్‌ ఏసీపీ రామారావు అన్నారు.  మండల కేంద్రంలో గురువారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. పోలీసు శాఖ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, మం డల స్థాయి అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. తహసీల్‌ కార్యా లయం నుంచి పీహెచ్‌సీ వరకు వరకు కొనసాగిన అవ గాహన ర్యాలీ వాహనదారులకు, ప్రజలకు మాస్క్‌ ప్రా ముఖ్యతతోపాటు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. 45 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా కరోనా టీకా వేయించుకోవాలని, కరోనా టీకా పట్ల ఎటువంటి అపోహలను నమ్మవద్దని సూచించారు. భౌతిక దూరం పాటించి, మాస్క్‌లు తప్పకుండా ధరించాలన్నారు. కార్యక్ర మంలో బోధన్‌రూరల్‌ సీఐ రవీందర్‌నాయక్‌, ఎంపీపీ శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ ఇమ్రాన్‌ఖాన్‌, తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీడీవో శంకర్‌, ఎస్సై ఎల్లాగౌడ్‌, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకయ్యగారి రామిరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-09T05:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising