ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలి

ABN, First Publish Date - 2021-01-25T05:26:27+05:30

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కేవలం పోలీసుల బాధ్యత మత్రమే కాదని, అందుకు ప్రతీ పౌరుడు సహకరించాలని, ఎప్పటికప్పుడు సమాచారం పోలీసులకు అందించాలని ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ రూరల్‌, జనవరి 24: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కేవలం పోలీసుల బాధ్యత మత్రమే కాదని, అందుకు ప్రతీ పౌరుడు సహకరించాలని, ఎప్పటికప్పుడు సమాచారం పోలీసులకు అందించాలని ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌ సూచించారు. రూరల్‌ మండలం తిర్మన్‌పల్లి గ్రామంలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటువల్ల నేరాలు తగ్గుముఖంపడతాయన్నారు. ప్రజలు బాధ్యతతో వ్యవహరిస్తారని తెలిపారు. సౌత్‌జోన్‌ సీఐ రఘునాథ్‌ మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అనుమానితులు సంచరించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిస్తే సురక్షిత ప్రయణాలు సాధ్యమవుతాయని తెలిపారు. రూ. 5 లక్షల వ్యయంతో గ్రామంలో 14 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ ంలో గ్రామ సర్పంచ్‌ చిటికెల శ్రీనివాస్‌ రెడ్డి, వీడీసీ చైర్మన్‌ కౌలాస్‌ మోహన్‌, సీఐ రఘునాథ్‌, ఎస్‌హెచ్‌వో మదుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-25T05:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising