చట్టం ముందు అందరూ సమానమే..
ABN, First Publish Date - 2021-10-31T06:51:25+05:30
చట్టం ముందు మహిళలు పురుషులు సమానామేనని హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి అన్నారు. మండలంలోని నడిపల్లి శివారులో గల జీ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి ఆధ్వర్యంలో జరిగిన సమావేశా నికి ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడుతూ..
డిచ్‌పల్లి, ఆక్టోబరు 30: చట్టం ముందు మహిళలు పురుషులు సమానామేనని హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి అన్నారు. మండలంలోని నడిపల్లి శివారులో గల జీ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి ఆధ్వర్యంలో జరిగిన సమావేశా నికి ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యాక్ర మంలో భాగంగా గ్రామగ్రామాన చట్టాలపై అవగహన కల్పించాడానికి కృషి చేయాలని సూచించారు. ఉచిత న్యాయ సేవ ద్వార పేద ప్రజలకు సంపూర్ణ న్యాయం అందించ డమే లక్ష్యమన్నారు. విద్యార్థులకు న్యాణ్యమైన విద్య , పేదలకు ఉచిత న్యాయం, అం దించాలని సూచించారు. చట్టంలో సర్వ హక్కులు ఉంటాయని వాటిని ప్రజలు అవసరా నికి వినియోగించుకోవాలని కోరారు. గ్రామస్థాయిలో చట్టాలపై నిరంతరం అవగహన కల్పించాలని న్యాయమూర్తి కోరారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ మాట్లాడుతూ.. నవంబరు 14 వరకు గ్రామస్థాయిలో అవగహన సదస్సు ఏర్పా టు చేయలన్నారు. నిరుపేదలకు అన్యాయం జరిగితే న్యాయం కోసం ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు అన్నారు. ఈ సందర్భంగా న్యాయ సేవ సవనీరు విడుదల చేశా రు. పాఠశాల విద్యార్థులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సదస్సులో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్జిలు గోవర్ధన్ రెడ్డి, గౌతమ్ ప్రసాద్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అరవింద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజరెడ్డి, న్యాయవాదులు, వైద్యులు , విద్యార్థులు పాల్గొన్నారు.
నిజామాబాద్ లీగల్: రాష్ట్ర హైకోర్టు జడ్జి విజయసేన్‌రెడ్డి శనివారం జిల్లాకు వచ్చి జిల్లా కోర్టు సందర్శించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేదల పట్ల సమన్వయంగా పనిచేయాల్సిన బాధ్య త న్యాయవాదులందరిపై ఉందని, కోర్టుకు సంబంధించిన కేసుల ను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
Updated Date - 2021-10-31T06:51:25+05:30 IST