ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింబాద్రిగుట్టకు పోటెత్తిన భక్తజనం

ABN, First Publish Date - 2021-10-17T06:21:48+05:30

శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు లింబాద్రిగుట్టకు తరలివచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాల అనంతరం స్వామివారి దర్శనం కోసం ఉదయం 6గంటల నుంచే భక్తులు క్యూ కట్టారు. గోవింద నామ స్మరణ

మెట్ల మార్గం ద్వారా వెళ్తున్న దిల్‌ రాజు దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమ్‌గల్‌, అక్టోబరు 16: శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు లింబాద్రిగుట్టకు తరలివచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాల అనంతరం స్వామివారి దర్శనం కోసం ఉదయం 6గంటల నుంచే భక్తులు క్యూ కట్టారు. గోవింద నామ స్మరణ చేయడంతో లింబాద్రిగుట్ట మార్మోగింది. పెద్దసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. 

స్వామిని దర్శించుకున్న నిర్మాత దిల్‌రాజు

భీమ్‌గల్‌ శ్రీలక్ష్మీనర్సింహస్వామి లింబాద్రిగుట్టపై  ప్రముఖ సినీ నిర్మాణ దిల్‌రాజు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. లింబాద్రి గుట్టపై స్వామివారిని దర్శించుకునేందుకు ఆయన సతీమణితో కలిసి దిల్‌రాజు లింబాద్రిగుట్టకు రాగా, ఆలయ వేదవ్రాహ్మణులు సాఽధరంగా ఆహ్వానించి గర్బగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో కలియ తిరిగారు. తన చిన్నతనంలో ఈ ప్రాంతంలో ఆడుకున్న ప్రదేశాలను, దర్శించుకున్న ప్రదేశాలను ఆయన భార్యకు వివరిస్తూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 

Updated Date - 2021-10-17T06:21:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising