ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలి

ABN, First Publish Date - 2021-12-09T05:40:03+05:30

ర్మూర్‌ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశ న్నగారి జీవన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



ఆర్మూర్‌టౌన్‌, డిసెంబరు 8: ఆర్మూర్‌ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశ న్నగారి జీవన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని నమస్తే నవనాథ పురం కార్యక్రమంలో భాగంగా బుధవారం 3, 19వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటిం చారు. హౌసింగ్‌బోర్డులో ఉన్న పార్కును సందర్శించి పార్కులో మొలిచిన గడ్డి, చెత్తచెదారం పెరుకుపోవడంతో మున్సిపల్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదని, మున్సిపల్‌ పరిధి లో క్లీన్‌అండ్‌గ్రీన్‌గా ఉంచాలని, రోడ్డుకు ఇరువైపులా చెత్తను తొలగించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. పార్కులో ఏర్పాటు చేసిన జిమ్‌ను పరి శీలించి మరమ్మతులు చేయించాలని తెలిపారు. మున్సిపల్‌ నిబంధనలకు వ్యతి రేకంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేయాలని మున్సిపల్‌ అధికారులకు సూచిం చారు. అనంతరం ప్రభుత్వ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. వివిధ పనులకు సంబంధించి ఉన్నతాధికారులతో ఫోన్‌ ద్వారా మాట్లాడా రు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ షేక్‌మున్న, కౌన్సిలర్‌లు వరలక్ష్మీ లింబాద్రి, గంగామోహన్‌చక్రు, తాటి హన్మాండ్లు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్‌, కలిగోట గంగాధర్‌, మోత్కురి లింగాగౌడ్‌, పోల సుధాకర్‌, ఖాందేశ్‌ శ్రీనివాస్‌, సుంకరి రవి, పండిత్‌ప్రేమ్‌, అంజగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising