కరోనా వ్యాక్సినేషన్ తప్పనిసరి
ABN, First Publish Date - 2021-10-21T06:03:15+05:30
ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని స్టేట్ హెల్త్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప అన్నారు. బుధవారం బోధన్‌లోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
స్టేట్ హెల్త్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప
బోధన్ రూరల్, అక్టోబరు 20: ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని స్టేట్ హెల్త్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప అన్నారు. బుధవారం బోధన్‌లోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ తప్పనిసరిగా చేసుకోవాలని, వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దన్నారు. జిల్లాలో బోధన్ అర్బన్‌లోనే 40శాతం మాత్రమే వ్యాక్సినేషన్ తీసుకున్నారని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా వ్యాక్సిన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డా. శివశంకర్, డిఫ్యూటీ డీఎంహెచ్‌వో డా.విద్య, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ శివానందం, డిఫ్యూటీ డీఎంహెచ్‌వో లత, వైద్య సిబ్బంది ఉన్నారు.
Updated Date - 2021-10-21T06:03:15+05:30 IST